Shama Sikander Face Casting Couch: క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి షామా సంచలన వ్యాఖ్యలు.. తానూ బాధితురాలినేనని స్పష్టం-bollywood actress shama sikander says casting couch exists everywhere ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shama Sikander Face Casting Couch: క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి షామా సంచలన వ్యాఖ్యలు.. తానూ బాధితురాలినేనని స్పష్టం

Shama Sikander Face Casting Couch: క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ నటి షామా సంచలన వ్యాఖ్యలు.. తానూ బాధితురాలినేనని స్పష్టం

Maragani Govardhan HT Telugu
Sep 15, 2022 05:39 PM IST

Shama Sikander on Casting Couch: బాలీవుడ్ నటి షామా సికిందర్ క్యాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విధానం ప్రతి చోటా ఉందని స్పష్టం చేశారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ ఆశ్చర్యకర విషయాలను బయటపెట్టారు.

<p>షామా సికిందర్</p>
షామా సికిందర్ (Twitter)

Shama Sikander Faces Casting Couch: క్యాస్టింగ్ కౌచ్ అంటే.. చిత్రసీమలో హీరోయిన్లకు అవకాశాలిస్తామని చెప్పి వారిని లొంగదీసుకుంటారని అందరూ అనుకుంటారు. కానీ ఈ హేయమైన విధానం కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీకే పరిమితం కాదు.. అన్నీ చోట్లా ఉందంటున్నారు బాలీవుడ్ నటి షామా సికిందర్. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన ఆమె.. గతంలో తాను కూడా దీని బాధితురాలినే అని తెలిపారు. కొంతమంది పేరున్న నిర్మాతలు తనతో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పేవారని, దానర్తం తనకు తర్వాత తెలిసొచ్చిందని స్పష్టం చేశారు.

"ప్రస్తుతం చిత్రసీమ చాలా వరకు మారింది. ఈ రోజుల్లో ఎంతో మంది యువ నిర్మాతలు, ప్రతిభావంతులైన నటుల కోసం చూస్తున్నారు. ఎంతో గౌరవంగా ఆదరిస్తున్నారు. పని కోసం సెక్స్ అనే కాన్సెప్టుకు దూరంగా ఉండటమే కాకుండా ప్రొఫెషనల్స్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ గతంలో అలా ఉండేది కాదు. కొంతమంది నిర్మాతలు వారితో స్నేహంగా ఉండమని నాతో అనేవారు. కలిసి పనిచేయకుండా స్నేహితులం ఎలా ఉండగలమని నేను అనేదాన్ని. కానీ వారి ఉద్దేశ్యమేంటో తర్వాత అర్థమైంది. అవకాశమిచ్చినందుకు వారి లైంగిక కోరికను తీర్చాలని తెలుసుకున్నాను. అయితే అంతకంటే హేయమైన చర్య ఇంకొకటి లేదని నేను భావించాను. ఒకవేళ అలా చేస్తే అత్యంత అభద్రతా భావంతో మీరు ఉన్నట్లు తెలుసుకోవాలి. ఇండస్ట్రీలో గొప్ప పేరున్న కొంతమంది నిర్మాతలు ఇలాంటి చర్యలను అవలంభిస్తున్నారు. నిజాయితీగా ఓ స్త్రీ గెలుచుకోగలరనే ఆత్మవిశ్వాసం మీకు లేదని ఇది సూచిస్తుంది." అని షామా సికిందర్ స్పష్టం చేశారు .

అలాగే క్యాస్టింగ్ కౌచ్ కేవలం బాలీవుడ్, చిత్రసీమకే పరితం కాలేదని.. ప్రతి చోటా జరుగుతుందని షామా తెలిపారు. "కొంతమంది క్యాస్టింగ్ కౌచ్ చేస్తున్నారని, మొత్తం ఇండస్ట్రీని నిందించలేము. ప్రతి వ్యక్తిలోనూ చెడు ఉంటుందని నేను భావిస్తున్నాను. అందుకే కొంతమంది ఇతరులను కించపరచాలని చూస్తుంటారు. మీ మనస్సులో ఉన్న ఈ రాక్షసత్వాన్ని తూలనాడాల్సిన ఆవశ్యకత ఉంది" అని షామా అన్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం