Bigg Boss 7 Telugu Vote: ఓటింగ్‌లో ఇరగదీస్తున్న శివాజీ.. జోకర్‌లా మిగిలిన హీరో.. ఆ హీరోయిన్ ఎలిమినేట్!
Bigg Boss 7 Telugu Voting Poll: బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ అసలు గేమ్ ఇప్పుడే మొదలు అయింది. హౌజ్‌మేట్ నుంచి కంటెస్టెంట్‌గా మారిన ఐదో వారం వారం ఓటింగ్‍లో ఇరగదీస్తున్నాడు. శివాజీతోపాటు నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్స్ కు నమోదైన ఓటింగ్ చూస్తే..
Bigg Boss 7 Telugu 5th Week Voting Result: తెలుగు పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారింది. అసలు ఆట ఇప్పుడే మొదలు అయింది. ఇటీవల పర్మనెంట్ హౌజ్‌మేట్స్ పవరాస్త్రను తీసుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. హౌజ్‌లోకి 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా.. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక ఎలిమినేషన్‌తో ప్రస్తుతం 10 మంది మిగిలారు.
ఏడుగురు నామినేట్
బిగ్ బాస్ 7 తెలుగులో ఆట సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ ముగ్గురు హౌజ్‌మేట్స్ కి కాకుండా ఏడుగురు మంది కంటెస్టెంట్స్ కి సోమవారం (అక్టోబర్ 2)న నామినేషన్స్ నిర్వహించారు. అయితే వారందరు నామినేట్ అయ్యారు. బిగ్ బాస్ 7 తెలుగు ఐదో వారం నామినేషన్లలో శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, శుభ శ్రీ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా అంతా ఉన్నారు. వీరికి సోమవారం నుంచే ఓటింగ్ పోల్ నిర్వహించారు.
టాప్‌లో శివాజీ
ప్రస్తుతం ఓటింగ్ పోల్‌లో శివాజీ ఇరగదీస్తున్నాడు. ఆడియెన్స్ పల్స్ తెలుసుకున్న శివాజీ పర్ఫెక్ట్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నాడు. మిగతా సీరియల్ బ్యాచ్ అంతా చిన్న పిల్లల్లా నిబ్బా వేశాలతో పడిపోతున్నారు. శివాజీ 33.46 శాతం ఓటింగ్‌తో టాప్ ప్లేసులో ఉన్నాడు. తర్వాత 17.48 శాతంతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో ప్లేసులో 13.19 శాతంతో శుభ శ్రీ ఉంది. విన్నర్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన సీరియల్ హీరో అమర్ దీప్ తన మాటలు తప్పితే ఆట లేకుండా జోకర్‌గా మిగిలాడు.
పడిపోయిన అమర్ దీప్
అమర్ దీప్ ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయాడు. అతనికి 10.95 ఓటింగ్ నమోదు అయింది. శుభ శ్రీ తర్వాతి స్థానంలో పడిపోవడం షాకింగ్ విషయం. అమర్ తర్వాత టేస్టీ తేజ 9.44 శాతంతో ఐదో స్థానం, 9.37 శాతంతో గౌతమ్ కృష్ణ 6వ ప్లేస్, 6.11 శాతంతో ఆఖరి స్థానంలో జానకి కలగనలేదు సీరియల్ హీరోయిన్ ప్రియాంక జైన్ ఉంది. అంటే ప్రస్తుతం ప్రియాంకనే డేంజర్ జోన్‌లో ఉంది. ఆమెనే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది.
ఐదోసారి వరుసగా
ఇంకా మూడు రోజుల సమయం ఉంది. మరి ఈ లోపు ప్రియాంక డైంజర్ జోన్ నుంచి తప్పించుకుంటుందా లేదా గత నలుగురు అమ్మాయిలు లాగానే ఎలిమినేట్ అవుతుందో చూడాలి. ఒకవేళ ప్రియాంక ఎలిమినేట్ అయితే.. వరుసగా ఐదో సారి మహిళలే ఎలిమినేట్ అయినట్లు రికార్డ్ అవుతుంది. ఇక సోమవారం నాటి ఓటింగ్‌లో కూడా 50.64 శాతంతో శివాజీ టాప్‌లో ఉన్నాడు. ఆయన తర్వాత 13.22 శాతంతో ప్రిన్స్ ఉన్నాడు.
టాపిక్