(1 / 7)
బిగ్ బాస్ ప్రతి సీజన్‍లో ఒక సింగర్ ఉంటారని తెలిసిందే. అలా బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి అడుగు పెట్టిన బ్యూటి దామిని భట్ల.
(2 / 7)
దామిని జులై 14, 1996న ఆంధ్రప్రదేశ్‍లోని రాజమండ్రిలో జన్మించింది. తండ్రి రాధాకృష్ణ చంద్రభట్ల, తల్లి శ్రీ ఝాన్సీ. దామినిక ఒక సోదరి మౌనిమా భట్ల ఉంది.
(3 / 7)
దామిని, మౌనిమా ఇద్దరూ సినీ రంగంలో సింగర్స్ గా రాణిస్తున్నారు. దామిని మొదటగా కర్ణాటక సంగీతం నేర్చుకుంది. వీరి కుటుంబం రాజమండ్రి నుంచి హైదరాబాద్‍కు మకాం మార్చారు.
(4 / 7)
రాజమౌళి బాహుబలి ది బిగినింగ్ సినిమాలో పచ్చ బొట్టేసిన పాటతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది దామిని. ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, హంసలేఖ, విద్యాసాగర్, దేవి శ్రీ ప్రసాద్, హారిస్ జయరాజ్, మణిశర్మ వంటి దర్శకులతో పనిచేసింది.
(5 / 7)
ఇటీవలే కొండపొలం సినిమాలోని ధం ధం పాటకు నేషనల్ అవార్డ్ వచ్చింది. ఈ పాటను సింగర్ దామిని ఆలపించింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లో కంటెస్టెంట్‍గా కొనసాగుతోంది దామిని.
(6 / 7)
బయట పద్ధతిగా కనిపించే సింగర్ దామిని బిగ్ బాస్ హౌజ్‍లో మాత్రం గ్లామర్ ట్రీట్ అందిస్తుంది. అయితే, దామిని బిగ్ బాస్ 7 తెలుగు మూడో వారం నామినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
(7 / 7)
దామిని భట్ల టాలీవుడ్‍లోనే కాకుండా బాలీవుడ్ సినిమాల్లోనూ పాటలు పాడింది. అలాగే తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఆలపించింది.
ఇతర గ్యాలరీలు