Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‍ను తిట్టడంపై నాగార్జున ఫైర్.. రెండో పవరాస్త్ర ఎవరికంటే?-bigg boss 7 telugu september 16th episode highlights and sivaji wins 2nd power astra ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‍ను తిట్టడంపై నాగార్జున ఫైర్.. రెండో పవరాస్త్ర ఎవరికంటే?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‍ను తిట్టడంపై నాగార్జున ఫైర్.. రెండో పవరాస్త్ర ఎవరికంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 17, 2023 05:54 AM IST

Bigg Boss 7 Telugu Second Power Astra: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍ సెప్టెంబర్ 16వ తేది ఎపిసోడ్‍లో హోస్ట్ నాగార్జున వచ్చి కంటెస్టెంట్లందరికీ క్లాస్ పీకాడు. అలాగే రెండో పవర్ ఆస్త్ర ఎవరు గెలుచుకున్నారో ప్రకటించాడు.

బిగ్ బాస్‍ను తిట్టడంపై నాగార్జున ఫైర్.. రెండో పవరాస్త్ర  ఎవరికంటే?
బిగ్ బాస్‍ను తిట్టడంపై నాగార్జున ఫైర్.. రెండో పవరాస్త్ర ఎవరికంటే?

Bigg Boss 7 Telugu September 16th Episode: బిగ్ బాస్ 7 తెలుగు గత ఎపిసోడ్‍లో కంటెస్టెంట్ల ప్రవర్తనపై హోస్ట్ నాగార్జున క్లాస్ తీసుకున్నాడు. అందరి లెక్కలు సరిచేశాడు. ఈ క్రమంలోనే ముందుగా రెండో పవర్ ఆస్త్ర సాధించికున్న కంటెస్టెంట్ ఎవరనేది చెప్పాడు. అయితే రెండో పవర్ ఆస్త్ర కోసం ఫైనన్ పోటీలో శివాజీ, షకీలా, అమర్ దీప్ చౌదరి ఉన్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురికి గార్డెన్‍లె ఎర్పాటు చేసిన చెవిలో గట్టిగా ఎవరు అరుస్తారో వాళ్లే గెలిచినట్లు అని బిగ్ బాస్ పోటీ పెట్టాడు.

అప్పుడే గెలుస్తారు

చెవిలో అరవడం పోటీలో ఎవరు గెలిచారని అనుకుంటున్నావ్ సింగర్ దామినిని నాగార్జున అడిగాడు. నువ్ సింగర్‍వి, నీకు డెసిబల్, ప్రీక్వెన్సీ ఇవన్ని తెలుసు అని నాగ్ అన్నాడు. నా మనసుకు నచ్చింది షకీలా అమ్మ. కాబట్టి ఆవిడ గెలిచిందనుకుంటున్నాను అని దామిని అంది. తర్వాత శివాజీని, అమర్ దీప్ చౌదరి ఇద్దరిని అడిగాడు నాగ్. వారు ఎవరి పేర్లు వారు చెప్పుకున్నారు. మైక్‍కి బాగా దగ్గరగా ఉండి అరవకూడదు, అలా అని దూరంగా వెళ్లి అరవకూడదు అప్పుడే గెలుస్తారని నాగార్జున అన్నారు.

అతనికి అంకితం

డెసిమల్స్ స్కేల్ స్కోర్‍లో షకీలాకు 9 మార్కులు, అమర్ దీప్‍కు -6, శివాజీకి 11 మార్కులు వచ్చాయి. దీంతో శివాజీ రెండో పవర్ ఆస్త్ర గెలుచుకుని రెండో పర్మనెంట్ హౌజ్ మేట్‍ అయ్యాడు. పవర్ ఆస్త్రను మొదటి హౌజ్ మేట్ ఆట సందీప్ చేతులమీదుగా శివాజీకి ఇప్పించాడు నాగార్జున. దాన్ని తన రెండో కొడుకు రిక్కీకి అంకితమిస్తున్నట్లు శివాజీ చెప్పాడు. అనంతరం శివాజీపై కాస్తా ఫైర్ అయ్యాడు నాగార్జున. ఆట తీరు బాగుందని చెప్పిన నాగ్.. మాటి మాటికి ఇంటికి వెళ్లిపోతారా సామీ, తలుపు తియ్యరా నాయన, నా వల్ల కాదు అని శివాజీ అన్న మాటలను వీడియోలో చూపించాడు.

బిగ్ బాస్‌కి సారీ

ఇది బిగ్ బాస్ హౌజ్. ఇక్కడ ఆయన రూల్సే ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇక్కడ బిగ్ బాస్‍ను ఎవరూ ప్రశ్నించడానికి లేదు అని నాగార్జున అన్నాడు. ఆ మాటలకు శివాజీ ఏకీభవించాడు. తెలుసు. తర్వాత నేను బిగ్ బాస్‍కి సారీ కూడా చెప్పాను. ఎంత అనుకున్నా.. సగటి మనిషిగా అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంది. నెక్ట్స్ టైమ్ అలా అనను అని శివాజీ చెప్పుకొచ్చాడు.