Bigg Boss 7 Telugu: అదిరిపోయిన బిగ్ బాస్ తెలుగు 7 హౌజ్.. భారీగా మార్పులు.. తొలిసారిగా అలా!-bigg boss telugu 7 grand launch promo released and house has big changes ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Telugu: అదిరిపోయిన బిగ్ బాస్ తెలుగు 7 హౌజ్.. భారీగా మార్పులు.. తొలిసారిగా అలా!

Bigg Boss 7 Telugu: అదిరిపోయిన బిగ్ బాస్ తెలుగు 7 హౌజ్.. భారీగా మార్పులు.. తొలిసారిగా అలా!

Sanjiv Kumar HT Telugu
Sep 03, 2023 07:12 AM IST

Bigg Boss Telugu 7 Promo: తెలుగు బిగ్ బాస్ లవర్స్, ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. బిగ్ బాస్ తెలుగు 7 సీజన్‍ను గ్రాండ్‍గా లాంచ్ చేయనున్నారు. దానికి సంబంధించిన బిగ్ బాస్ 7 తెలుగు ప్రోమో మరింత ఆసక్తి పెంచేలా ఉంది.

బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ లాంచ్
బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ లాంచ్

అమెరికాలో బిగ్ బ్రదర్ అనే పేరుతో ప్రారంభమైన రియాలిటీ షో ఎల్లలు దాటి ఇండియాలోకి వచ్చేసింది. ముందుగా హిందీలో బిగ్ బాస్ అనే పేరుతో ప్రారంభమైన ఈ రియాలిటీ షో తర్వాత ఇతర ప్రాంతీయ భాషల్లోనూ సందడి చేస్తూ వచ్చింది. అలా తెలుగులో 2017లో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. దీనికి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‍గా చేయడంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత వచ్చే సీజన్స్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‍ను నాని హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

గ్రాండ్ లాంచ్

ఇక బిగ్ బాస్ తెలుగు 3 సీజన్ నుంచి టాలీవుడ్ కింగ్ నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికీ 6 టీవీ, 1 ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుంది. ప్రతి ఏడాది వచ్చినట్లుగానే ఈసారి బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబర్ 3 నుంచి అంటే నేటి నుంచి ప్రారంభం కానున్న బిగ్ బాస్ 7 తెలుగును గ్రాండ్‍గా లాంచ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఎవరూ ఊహించని విధంగా ఈ బిగ్ బాస్ సీజన్ 7 ఉంటుందని, అంతా ఉల్టా పుల్టా అంటూ నాగార్జున ఇప్పటికే హైప్ క్రియేట్ చేశారు.

స్పెషల్‍గా కెప్టెన్ రూమ్

తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ 7 తెలుగు ప్రోమోలో హౌజ్ ఎలా ఉందో చూపించారు. ఈ ప్రోమోలో నాగార్జున మాస్ లుక్‍లో కనిపించారు. అంతేకాకుండా గత హౌజ్‍లతో పోలిస్తే ఈసారి బిగ్ బాస్ హౌజ్‍లో భారీ మార్పులు చేశారు. ముఖ్యంగా జైలు పైన ఒక బెడ్ రూమ్ కనిపిస్తుంది. దానికి హాల్ లో నుంచి మెట్లు ఉన్నాయి. ఇలా సెపరేట్‍గా ఓ బెడ్ రూమ్ ఉండటం ఇదే మొదటిసారి. ఈ బెడ్ రూమ్ కెప్టెన్ కోసం అని రివ్యూవర్స్ అంచనా వేస్తున్నారు. పైన బెడ్ రూమ్ ఉంటే దాని కిందిగా స్విమ్మింగ్ పూల్‍ ఉంది.

కంటెస్టెంట్స్

బెడ్ రూమ్ నుంచి నేరుగా స్విమ్మింగ్ పూల్‍లోకి దూకేలా ఉంది. అంతేకాకుండా బాల్కనీలో జైలు ఉంది. ఇప్పటివరకు జైలు కింద, దూరంగా అందరికీ దూరంగా ఉండేది. మంచి రంగులతో హాల్, విశాలంగా బెడ్ రూమ్స్ ఉన్నాయి. ఇక ప్రోమోలో ఎరుపు చీరలో కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టిలా (Shobha Shetty) అనిపిస్తుంది. అలాగే ఇందులో మోడల్ ప్రిన్స్ యావర్ (Prince Yawar), బ్లాక్ డ్రెస్సులో ప్రియాంక జైన్ (Priyanka Jain) ఉన్నట్లుగా కనిపిస్తోంది. మొత్తానికి గత సీజన్లతో పోలిస్తే ఈ ఏడో సీజన్‍ను మేకర్స్ గట్టిగా అదే.. ఉల్టా పుల్టాలా ప్లాన్ చేసినట్లున్నారు.

Whats_app_banner