Bigg Boss Srihan Awara Zindagi: 'ఆవారా'గా మారిన బిగ్‌బాస్ శ్రీహాన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్-bigg boss srihan new movie awara zindagi first look poster release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Srihan Awara Zindagi: 'ఆవారా'గా మారిన బిగ్‌బాస్ శ్రీహాన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Bigg Boss Srihan Awara Zindagi: 'ఆవారా'గా మారిన బిగ్‌బాస్ శ్రీహాన్.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

Maragani Govardhan HT Telugu
Oct 05, 2022 05:43 AM IST

Awara Zindagi First Look Poster: ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీహాన్ ఓ చిత్రంతో హీరోగా మారాడు. అదే ఆవారా జిందగీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

<p>బిగ్‌బాస్ శ్రీహాన్ హీరోగా ఆవారా జిందగీ</p>
బిగ్‌బాస్ శ్రీహాన్ హీరోగా ఆవారా జిందగీ (Twitter)

Bigg Boss Srihan Awara Zindagi First Look Poster: ఫన్ ఓరియెంటెడ్ మూవీగా ఓ యూత్ ఫుల్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఆవారా జిందగి మూవీ. నేటితరం ఆడియన్స్ మెచ్చే కథ ఎంచుకొని దానికి కావాల్సినంత ఫన్ యాడ్ చేస్తూ థియేటర్స్ లో మజా చేసేందుకు సిద్ధమవుతోంది ఆవారా జిందగి టీమ్. గతంలో వచ్చి సూపర్ సక్సెస్ సాధించిన ఫన్ కాన్సెప్ట్ జాబితాలో తమ సినిమా కూడా నిలిచేలా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా రూపొందించారు దర్శకనిర్మాతలు.

ఫన్ ఫిల్డ్ ఎంటర్ టైనర్ మూవీగా రాబోతున్న ఈ ఆవారా జిందగి చిత్రానికి దేప శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విభా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు నిర్మాత నంద్యాల మధుసూదన్ రెడ్డి. ఈ చిత్రానికి కంభంపాటి విజయ్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరించగా.. ప్రతీక్ నాగ్ సంగీతం అందించారు. ఖర్చుకు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సినిమా హై క్వాలిటీలో రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఒక్కో అప్‌డేట్ వదులుతూ ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు.

విడుదల చేసిన కాసేపట్లోనే ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ అందుకుంది ఈ ఆవారా జిందగి ఫస్ట్ లుక్ పోస్టర్. సినిమా కథను రిప్రెజెంట్ చేసేలా నలుగురు కుర్రాళ్లతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. పోస్టర్ లో కనిపిస్తున్న చార్మినార్, పిస్తోల్, రూ.2000ల నోట్లు అలాగే ఆ నలుగురి లుక్స్ ఈ సినిమాలో వైవిధ్యం ఉండనుందని స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఆ నలుగురి ఆవారా పనులు ఎలా ఉండబోతున్నాయి? ఆ పనులకు కామెడీ ఎలా లింక్ చేశారు? తమ క్యారెక్టర్స్‌తో ఈ ఆవారా కుర్రోళ్ళు ప్రేక్షకులను ఎలా ఎంటర్‌టైన్ చేస్తారు అనేది థియేటర్స్ లో చూద్దాం.

బిగ్‌బాస్ శ్రీహాన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ ఆవారా జిందగి సినిమాను ఆడియన్స్ కోరుకునే విధంగా కామెడీ ప్రధానాంశంగా తెరకెక్కించారు. నలుగురు కుర్రోళ్ళ నడుమ నడిచే ఫుల్ లెంగ్త్ హాంస్యంతో ఈ సినిమాను గ్రాండ్‌గా రూపొందిస్తున్నారు. జీరో లాజిక్ 100% ఫన్ అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా రానుండటం ఆసక్తికర అంశం. అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించేలా ఈ సినిమా కథ ఎంచుకొని ఇంట్రెస్టింగ్ లొకేషన్స్ లో తెరకెక్కించారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

చిత్రంలో బిగ్‌బాస్ శ్రీహాన్, ముక్కు అజయ్, ఢీ చెర్రీ, జస్వంత్, షియాజీ షిండే, సద్దాం, టార్జాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిత్రానికి శ్యామ్ ప్రసాద్ వీ, ఉరుకుంద రెడ్డి ఎస్.. సినిమాటోగ్రాఫర్స్‌గా పని చేయగా.. ఎస్‌బీ రాజు తలారి ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. అతిత్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం