Bigg Boss Srihan Movie Title: హీరోగా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ ఫేమ్ శ్రీహాన్
Bigg Boss Srihan Movie Title: బిగ్‌బాస్ ఫేమ్ శ్రీహాన్ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న అతడి మొదటి సినిమాకు డిఫరెంట్ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఆ టైటిల్ ఏదంటే...
Bigg Boss Srihan Movie Title: ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా కొనసాగుతున్నాడు శ్రీహాన్. టైటిల్ గెలిచే అవకాశం ఉన్న కంటెస్టెంట్స్‌లో శ్రీహాన్ పేరు కూడా వినిపిస్తోంది. మెచ్యూర్డ్‌గా గేమ్ ఆడుతూ బిగ్‌బాస్ ఫ్యాన్స్ మనసుల్ని గెలుచుకుంటుంటాడు. శ్రీహాన్ హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. ఆవారా జిందగీ పేరుతో ఓ సినిమా చేయబోతున్నాడు.
ఈ సినిమా టైటిల్ లోగోను శుక్రవారం రిలీజ్ చేశారు. బీర్ బాటిల్స్ కార్ బొమ్మను చూపిస్తూ డిఫరెంట్‌గా టైటిల్‌ను డిజైన్ చేశారు. లో లాజిక్స్ 100 పర్సెంట్ ఫన్ అనే క్యాప్షన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఔట్ అండ్ ఔట్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. అవారా జిందగీ సినిమాకు శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
ఆవారా జిందగీ సినిమాలో జబర్ధస్త్ ముక్కు అజయ్, సద్ధాం, జస్వంత్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. బిగ్‌బాస్‌లోకి శ్రీహాన్ అడుగుపెట్టక ముందే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నారు. అక్టోబర్ నెలలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
బిగ్‌బాస్ క్రేజ్ క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం. కాగా బిగ్‌బాస్ సీజన్ 5లో శ్రీహాన్ ప్రియురాలు సిరి హనుమంతు కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. ఆమె ద్వారా శ్రీహాన్ పేరు ఎక్కువగా వెలుగులోకి వచ్చింది.