Arjun Ambati: చిన్న సినిమా అన‌గానే డ‌బ్బులు తీసుకొని వెళ్లిపోతారు - అర్జున్ అంబాటి కామెంట్స్‌-bigg boss fame arjun ambati teppa samudram movie releasing in theaters on april 19th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Arjun Ambati: చిన్న సినిమా అన‌గానే డ‌బ్బులు తీసుకొని వెళ్లిపోతారు - అర్జున్ అంబాటి కామెంట్స్‌

Arjun Ambati: చిన్న సినిమా అన‌గానే డ‌బ్బులు తీసుకొని వెళ్లిపోతారు - అర్జున్ అంబాటి కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 17, 2024 09:27 AM IST

Arjun Ambati: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబాటి హీరోగా న‌టిస్తోన్న తెప్ప స‌ముద్రం మూవీ ఏప్రిల్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో చైత‌న్య‌రావు విల‌న్‌గా న‌టిస్తున్నాడు.

అర్జున్ అంబాటి  తెప్ప స‌ముద్రం మూవీ
అర్జున్ అంబాటి తెప్ప స‌ముద్రం మూవీ

Arjun Ambati: బిగ్‌బాస్ ఫేమ్ అర్జున్ అంబాటి హీరోగా న‌టిస్తోన్న టాలీవుడ్ మూవీ తెప్ప స‌ముద్రం ఏప్రిల్ 19న థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది. చైత‌న్య రావు విల‌న్‌గా క‌నిపిస్తుండ‌గా కిశోరి ధాత్రిక్ హీరోయిన్ రోల్ చేసింది. స‌తీష్ రాపోలు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

చిన్న సినిమాల‌ను బ‌తికించాలి....

తెప్ప స‌ముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల జ‌రిగింది. ఈ వేడుక‌కు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజ‌ర‌య్యాడు. తెప్ప స‌ముద్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అర్జున్ అంబాటి చిన్న సినిమాల‌పై ఆస‌క్తి కామెంట్స్ చేశాడు. అర్జున్ అంబాటి మాట్లాడుతూ ....బడ్జెట్ తక్కువ అయినా ప్రతి ఒక్కరూ తెప్ప స‌ముద్రం సినిమాకు చ‌క్క‌టి సపోర్ట్ అందించారు.

చిన్న సినిమా అనగానే కాస్ట్ అండ్ క్రూ వచ్చామా.. పని చేశామా.. డబ్బులు తీసుకుని వెళ్లామా అన్నట్లు ఉంటారు. కానీ డైరెక్టర్, నిర్మాతల‌కు తడిసి మోపెడవుతుంది. సినిమా రిలీజ్ వరకూ వాళ్లు చాలా వేదన పడుతుంటారు. మా నాన్న, పెద్దనాన్న‌ డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు తెలిసింది సినిమా ఒక్కటే.

అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చిన్న సినిమాను బతికించాలని కోరుతున్నా. తెప్ప స‌ముద్రం సినిమా 90 శాతం షూటింగ్ పోచంపల్లిలో చేశాం. ఏప్రిల్ 19న ఈ సినిమాను అందరూ థియేటర్లలో సినిమానుఏ చూసి ఆదరించాలని కోరుతున్నా’’ అని అన్నాడు.

ర‌జాకార్ త‌ర్వాత‌...

ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. నేను ఫస్ట్ టైమ్ నేను రజాకార్ సినిమాకు గెస్ట్‌గా వచ్చా. ఆ సినిమా పెద్ద హిట్ట‌యింది. ఇప్పుడు తెప్పసముద్రం ఈ సినిమాకు పెద్ద పెద్ద స్టార్ హీరోలు లేరు. అందరూ మధ్య తరగతివారే పని చేశారు. ‘తెప్పసముద్రం’ లాంటి సినిమా హిట్ అయితే కృష్ణానగర్‌లోని ప్రతి ఒక్కరికీ పని దొరుకుతుంది అని చెప్పాడు.

ఈ సినిమాలో తాను విల‌న్‌గా క‌నిపిస్తాన‌ని చైత‌న్య రావు అన్నాడు. న‌టుడిగా త‌న‌ను కొత్త కోణంలో ఆవిష్క‌రించే సినిమా ఇద‌ని తెలిపాడు. రెగ్యుల‌ర్‌గా వ‌చ్చే థ్రిల్ల‌ర్ సినిమాల‌కు పూర్తి భిన్నంగా తెప్ప స‌ముద్రం ఉంటుంద‌ని అన్నాడు. చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాల‌ను సందేశాత్మ‌కంగా ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు అన్నాడు. ఇది చిన్న సినిమా కాదు.. కంటెంట్ ఉన్న సినిమా అని తెలిపాడు.

తెలుగు బిగ్‌బాస్‌లో

బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అర్జున్ అంబాటి ఆరో స్థానంలో షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. ఫైన‌ల్ చేరుకున్న అత‌డు చివ‌ర‌లో ఓటింగ్ లో వెనుక‌బ‌డ్డాడు. బిగ్‌బాస్ కంటే ముందు తెలుగులో ప‌లు సీరియ‌ల్స్‌, సినిమాల్లో అర్జున్ అంబాటి కీల‌క పాత్ర‌లు పోషించారు.

సుంద‌రి, తీస్‌మార్‌ఖాన్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశాడు. ప‌రంప‌ర తెలుగులో వెబ్‌సిరీస్‌లో విల‌న్‌గా క‌నిపించాడు. ప‌లు తెలుగు టీవీ సీరియ‌ల్స్‌లో లీడ్ రోల్ చేశాడు అర్జున్ అంబాటి.చైత‌న్య‌రావు కూడా హీరోగా చిన్న సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. కీడాకాలో, అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో, ష‌ర‌తులు వ‌ర్తిస్తాయితో ప‌లు సినిమాల‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు.