Bigg Boss Gautham Krishna: ఓ లిమిట్ ఉంటుంది: కన్నీరు పెట్టుకున్న గౌతమ్.. సారీ చెప్పిన అవినాశ్.. హౌస్‍మేట్స్‌కు గిఫ్ట్
Bigg Boss Gowtham Krishna: వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‍గా వచ్చిన గౌతమ్ కృష్ణ కన్నీరు పెట్టుకున్నారు. అవినాశ్ కామెంట్‍తో బాగా ఫీల్ అయ్యారు. దేనికైనా లిమిట్ ఉంటుందంటూ ఫైర్ అయ్యారు. గేమ్ ఫన్నీగా ఆడటంతో కంటెస్టెంట్లకు ఓ గిఫ్ట్ ఇచ్చారు బిగ్‍బాస్.
బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎనిమిది మంది కంటెస్టెంట్లు వచ్చాక ఆట కాస్త ఇంట్రెస్టింగ్‍గా మారింది. వారు గత సీజన్లలో ఆడిన వారే కావటంతో మరింత ఆసక్తికరంగా ఉంది. గౌతమ్ కృష్ణ, అవినాశ్ మళ్లీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, గత సీజన్‍లో జరిగిన ఓ విషయాన్ని అవినాశ్ గుర్తు చేయడంతో గౌతమ్ ఫీలయ్యారు. ఏకంగా కన్నీరు పెట్టుకున్నారు. నేటి ఎపిసోడ్ (అక్టోబర్ 9)లో ఈ తంతు సాగింది.
సరదాగా గేమ్
అమ్మాయిలు, అబ్బాయిలను టీమ్‍లుగా విభజించి గేమ్ ఆడించారు బిగ్‍బాస్. అబ్బాయిలకు లీడర్‌గా రోహిణి, అమ్మాయిలకు హెడ్‍గా అవినాశ్ ఉండాలని చెప్పారు. దీంతో బిగ్‍బాస్ కన్‍ఫ్యూజ్ అయినట్టున్నారని, తాను అమ్మాయిని, అవినాశ్ అబ్బాయి అని రోహిణి చెప్పారు. దీంతో తాను సరిగానే చెప్పానని బిగ్‍బాస్ అన్నారు. నవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించు అనే గేమ్ జరిగింది. నోటితో నీరు నింపుకున్న కంటెస్టెంట్‍ను నవ్విస్తే వారు ఔట్ అని బిగ్‍బాస్ చెప్పారు. హౌస్‍మేట్స్ మధ్య ఈ గేమ్ సరదాగా సాగింది. నవ్వించేందుకు తంటాలు పడ్డారు. కామెడీగా మాట్లాడారు.
లిమిట్ ఉంటుంది.. గౌతమ్ ఫైర్
గౌతమ్ కృష్ణను నవ్వించాలనుకునే ప్రయత్నంలో అశ్వత్థామ వచ్చాడంటూ అవినాశ్ గట్టిగా అరిచారు. గత సీజన్‍లో రీఎంట్రీ ఇచ్చిన సమయంలో అశ్వత్థామ ఈజ్ బ్యాక్ అంటూ గౌతమ్ అన్నారు. దానిపై గట్టిగా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు మరోసారి అశ్వత్థామ 2.0 అని గుర్తు చేయటంతో అవినాశ్‍పై గౌతమ్ ఫైర్ అయ్యారు.
సీజన్ 7లో అయిపోయిన దాన్ని పదేపదే అంటూ చిరాకు తెప్పించొద్దని అవినాశ్‍పై గౌతమ్ కృష్ణ గట్టిగా అరిచారు. కావాలంటే తాను వెళ్లిపోతానంటూ కోప్పడ్డారు. “ఒక లిమిట్ ఉంటుంది. వచ్చినప్పుడు అంటుంటే చాలా మందికి చెప్పా” అని గౌతమ్ సీరియస్ అయ్యారు. మైక్ నేలకేసి కొట్టారు.
అప్పుడు మైండ్‍సెట్ వేరు.. గౌతమ్ కన్నీరు
ఆ తర్వాత గౌతమ్‍ను సముదాయించేందుకు అవినాశ్ ప్రయత్నించారు. ఈ సందర్భంగా గౌతమ్ కన్నీరు పెట్టుకున్నారు. “సీజన్ 7లో ఆ విషయంలో చాలా ట్రోలింగ్ జరిగింది. దాన్ని తీయవద్దని చాలాసార్లు అనుకున్నా. సాధారణంగా నేను ఏడ్వను” అని గౌతమ్ ఏడ్చేశారు.
సీజన్ 7లో తన మైండ్‍సెట్ వేరుగా ఉండేదని చెప్పారు. “ఒక సంవత్సరం కింద అన్నదానికి అప్పుడు నా మైండ్‍సెట్ వేరు. అప్పుడు నన్ను ఒక్కొక్కరు ఒక్కోలా ట్రీట్ చేస్తుంటే తట్టుకోలేక అన్న మాట అది. ఎంత మందికి చెప్పాలి” అని గౌతమ్ అన్నారు. ఈ విషయాలు తనకు తెలియదని అవినాశ్ చెప్పారు. గౌతమ్‍కు సారీ చెప్పారు.
ఉప్పు గిఫ్ట్
నవ్వకుండా ఉండేందుకు ప్రయత్నించు టాస్కులో ఎంటర్‌టైన్ చేసినందుకు కంటెస్టెంట్లకు ఓ ఉప్పు ప్యాకెట్‍ను బిగ్‍బాస్ గిఫ్ట్ ఇచ్చారు. ఈసారి రేషన్ తీసుకున్న సమయంలో ఉప్పు తీసుకోలేదు హౌస్‍మేట్స్. దీంతో ప్రైజ్‍మనీ నుంచి రూ.50వేలు తీసుకొని ఓ ప్యాకెట్ ఇచ్చారు బిగ్‍బాస్. ఇప్పుడు, మరో ఉప్పు ప్యాకెట్‍ను బహుమతిగా ఇచ్చారు. ఉప్పు గెలుచుకున్నందుకు లైఫ్‍లో ఇంత ఎప్పుడూ ఆనందపడలేదని రోహిణి అన్నారు.
గంగవ్వ, హరితేజ, విష్ణు డ్యాన్స్
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో అని హరితేజ పాటపాడారు. ఆ తర్వాత గంగవ్వ, విష్ణు కూడా గొంతు కలిపి.. డ్యాన్స్ చేశారు. గంగవ్వ ఫుల్ జోష్‍తో చిందేశారు.
ఆ తర్వాత గౌతమ్ మళ్లీ ఒంటరిగా బాధపడ్డారు. ఈసారి గట్టిగా అడి గెలుస్తానంటూ చెప్పారు. “నాన్న.. మాట్లకుండా వచ్చా గొడవ పడి వచ్చా. నేను బాగానే ఉంటా. ఈసారి కప్ గెలిచి.. గర్వపడేలా చేస్తా. గట్టిగా ఆడతా” అని తనలో తానే గౌతమ్ మాట్లాడుకున్నారు.
బిగ్‍బాస్ తనను నవ్వించాలని అవినాశ్, రోహిణి అడిగారు. దీంతో తాను బిగ్‍బాస్ అని, రోహిణి బిగ్‍బాస్ భార్య అని అవినాశ్ చెప్పారు. బిగ్‍బాస్‍ను ఇమిటేట్ చేశారు.
'సరదాకే సరదా పుట్టే సమయంలో' పాటతో 39వ రోజు మొదలైంది. కంటెస్టెంట్లు ఫుల్ జోష్‍తో డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత హౌస్‍లో హోటల్ మేనేజ్‍మెంట్ టాస్క్ మొదలైంది. యష్మి, మణికంఠకు హౌస్‍కీపింగ్ పోస్ట్ ఇవ్వగా.. గంగవ్వకు మహారాణి స్టేటస్ ఇచ్చారు బిగ్‍బాస్. మిగిలిన వారికి ఆయా పోస్టులను అప్పగించారు. నబీల్ అప్పుల్లో కూరుకుపోయిన ఓనర్, ప్రేరణ మేనేజర్, నిఖిల్ హెడ్‍చెఫ్ ఇలా అందరికీ కొన్ని పోస్టులు ఇచ్చారు. ఈ టాస్కే రోజంతా సాగింది. కంటెస్టెంట్లు వారికి కేటాయించిన పనులు చేశారు.