Bigg Boss Remuneration: వైల్డ్ కార్డుతో ఐదుగురు ఎంట్రీ.. శివాజీకి సమానంగా అతని రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే!-bigg boss 7 telugu wild card entry contestants remuneration details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bigg Boss 7 Telugu Wild Card Entry Contestants Remuneration Details

Bigg Boss Remuneration: వైల్డ్ కార్డుతో ఐదుగురు ఎంట్రీ.. శివాజీకి సమానంగా అతని రెమ్యునరేషన్.. ఎంతో తెలిస్తే!

Sanjiv Kumar HT Telugu
Oct 06, 2023 01:42 PM IST

Bigg Boss 7 Telugu Wild Card Entry: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే అంతా ఉల్టా పుల్టాగా సాగుతోన్న ఈ ఏడో సీజన్‌లోకి వైల్డ్ కార్డుతో ఏకంగా ఐదుగురు ఎంట్రీ ఇస్తున్నారు. ఇక వారికి ఇచ్చే పారితోషికం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.

బిగ్ బాస్ 7 తెలుగులోకి వైల్డ్ కార్డుతో ఐదుగురు ఎంట్రీ.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్ బాస్ 7 తెలుగులోకి వైల్డ్ కార్డుతో ఐదుగురు ఎంట్రీ.. ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతంటే?

Bigg Boss 7 Telugu Contestants Remuneration: నాగార్జున మరోసారి హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లోకి మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే వీళ్లు హౌజ్‌మేట్స్ కాదని కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే అని షో ప్రారంభం రోజున నాగార్జున చెప్పారు. హౌజ్‌మేట్స్ అయ్యేందుకు పవరాస్త్రను గెలవాలని చెప్పారు. ఈ క్రమంలోనే మొదటి నాలుగు వారాల్లో వరుసగా కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయారు.

ట్రెండింగ్ వార్తలు

కెప్టెన్సీ టాస్క్

అయితే పవరాస్త్ర గెలిచి ఆట సందీప్, హీరో శివాజీ, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ హౌజ్‌మేట్స్ అయ్యారు. కానీ, తర్వాత వీరందరి పవరాస్త్రను బిగ్ బాస్ తీసేసుకున్నాడు. ఇప్పుడు హౌజ్‌లో 10 మంది ఉన్నారు. వారిలో శివాజీ, అమర్ దీప్, ప్రియాంక, శుభ శ్రీ, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా ఐదోవారం నామినేట్ అయ్యారు. వీరందరికి మొదటి కెప్టెన్సీ టాస్క్ నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్. ప్రస్తుతం కెప్టెన్సీ ఫైనల్ కంటెండర్ టాస్క్ నడుస్తోంది.

మొత్తం 15 మంది

ఇదిలా ఉంటే హౌజ్‌లో 10 మంది ఉండగా మరో ఐదుగురు వైల్డ్ కార్డుతో ఎంట్రీ ఇవ్వనున్నారు. అర్జున్ అంబటి, గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ పూజా మూర్తి, సింగర్ భోలే, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని, జబర్దస్త్ కెవ్వు కార్తీక్ కన్ఫర్మ్ అయ్యారు. అయితే, ఇదివరకు వార్తలు వచ్చినట్లు యూట్యూబర్ నిఖిల్, అంజలి-పవన్ దంపతులు బిగ్ బాస్‌కు రావట్లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం వీరికి ఇచ్చే పారితోషికం హాట్ టాపిక్ అవుతోంది.

శివాజీ అంతా

అర్జున్ అంబటికి అత్యధికంగా వారానికి రూ. 4.5 లక్షలు ఇవ్వనున్నారట. హాట్ బ్యూటి నయని పావనికి వారానికి రూ. 2.5 లక్షలు, పూజా మూర్తికి రూ. 1.5 లక్షలు, సింగర్ భోలేకు రూ. 1.5 లక్షలు, కెవ్వు కార్తీక్‌కు కూడా రూ. 1.5 లక్షలు ముట్టజెప్పనున్నారని సమాచారం. తన ఆటతో దూసుకుపోతున్న శివాజీకి కూడా రూ. 4.5 లక్షల రెమ్యునేషన్ ఇస్తున్నారట. అంటే శివాజీ, అర్జున్ ఇద్దరికి ఒకే పారితోషికం.

అమర్‌కి అధికంగా

ఇక బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లోకి విన్నర్ మెటేరియల్‌గా వచ్చిన సీరియల్ హీరో అమర్ దీప్‌కు అందరికంటే ఎక్కువగా రూ. 3 లక్షలు ఇస్తున్నారని సమాచారం. కానీ, తన ఆటతో, నోరుతో తీవ్రమైన నెగెటివిటీ తెచ్చుకున్నాడు అమర్. కొరియోగ్రాఫర్ ఆట సందీప్‌కు శివాజీ తరహాలోనే వారానికి రూ. 2.5 లక్షలు ఇస్తున్నారని సమాచారం.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.