Bigg Boss Sivaji: జైళ్లో హీరో శివాజీ.. అమర్ దీప్‌కు అనారోగ్యం.. సెలైన్ ఎక్కించి ట్రీట్‌మెంట్
Bigg Boss 7 Telugu Sivaji Amardeep: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ఇన్వెస్టిగేషన్ టాస్క్ జరుగుతుంది. అందులో భాగంగానే హీరో శివాజీకి జైలు శిక్ష పడుతుంది. అది టాస్క్ అయితే, అమర్ దీప్ మళ్లీ నిజంగానే అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అమర్‌కు సెలైన్ ఎక్కించి ట్రీట్‌మెంట్ అందించారు.
Bigg Boss 7 Telugu Day 80 Episode Highlights: బిగ్ బాస్ 7 తెలుగు హౌజ్‌లో ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ టాస్క్ నడుస్తోంది. మిసెస్ బిగ్ బాస్‌ను ఎవరు చంపారో తెలుసుకుని, మాయమైన నెక్లెస్‌ను పట్టుకోవాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఇందులో హీరో శివాజీకి నెక్లెస్ ఇచ్చి.. మీరే అసలైన విలన్.. హౌజ్‌లో ఒక్కొక్కరిని ఎవరికీ తెలియకుండా చంపాలి అని సీక్రెట్ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్.
సీక్రెట్ టాస్క్‌లో భాగంగా ముందుగా ప్రశాంత్‌ను చంపమని బిగ్ బాస్ చెబుతాడు. అందుకు ప్రశాంత్ మొక్కను పోస్ట్ బాక్స్‌లో పెట్టమంటాడు. దానికి ప్రశాంత్‌ను స్టోర్ రూమ్‌లోకి వెళ్లమని చెప్పిన శివాజీ అక్కడే తాను పిలిచేవరకు సైలెంట్‌గా ఉండమంటాడు శివాజీ. ఆ సమయంలో మిరమ మొక్కను పోస్ట్ బాక్స్‌లో పెట్టడంతో ప్రశాంత్ డెడ్ అయిపోతాడు.
దాంతో ప్రశాంత్‌కు దెయ్యం కాస్ట్యూమ్ ఇచ్చి ఎవరితో మాట్లాడొద్దని, లైట్స్ ఆఫ్ చేసినప్పుడు తిరగాల్సిందిగా బిగ్ బాస్ చెబుతాడు. ప్రశాంత్ అలాగే చేస్తాడు. అయితే, ప్రశాంత్‌ను ఎవరు చంపారో గౌతమ్ కనిపెడతాడు. నిన్ను శివాజీ అన్ననే కదరా చంపింది అని ప్రశాంత్‌ను గౌతమ్ అడుగుతాడు. కానీ, దానికి ప్రశాంత్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా వెళ్లిపోతాడు. అనంతరం, రతిక, శోభాను చంపాల్సిందిగా బిగ్ బాస్ శివాజీకి చెబుతాడు.
ఈ క్రమంలోనే నువ్వే హంతకుడివి అని డౌట్‌గా ఉందని శోభా అంటుంది. రతికను కన్ఫెషన్ రూమ్‌కు రమ్మని బిగ్ బాస్ చెప్పాడని ఆమెతో శివాజీ చెబుతాడు. కానీ, దానికి రతిక నమ్మదు. నీపైనే డౌట్‌గా ఉందన్న అని రతిక అంటుంది. దాంతో శివాజీ సీక్రెట్ టాస్క్ అందరికీ తెలియడంతో టాస్క్ ఫెయిల్ అవుతుంది. తనే మర్డరర్ అని తెలిసిన శివాజీని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ జైలులో వేస్తారు.
ఇదిలా ఉంటే ఈ డెత్ మిస్టరీ టాస్క్ జరిగే సమయంలో అమర్ దీప్‌కు ఆరోగ్యం మళ్లీ పాడైంది. అమర్ ఇదివరకు నరాల వీక్‌నెస్‌తో స్పృహ తప్పిపడిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ టాస్కులో అమర్‌కు తీవ్రమైన పెయిన్ వచ్చిందట. అంతేకాకుండా అమర్‌కు సెలైన్ ఎక్కించి మరి ట్రీట్‌మెంట్ అందించారని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. అయితే, ఇప్పుడు అమర్ ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని తెలుస్తోంది.