Bigg Boss 7 Telugu: వాడికి క్యారెక్టర్ లేదు, కుక్క తోక వంకర.. అమ్మాయిలను తిట్టిన హీరో శివాజీ
Bigg Boss 7 Telugu Sivaji: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ మంచి హీట్‌తో సాగుతుంది. బిగ్ బాస్ 7 తెలుగు సెప్టెంబర్ 20వ తేది ఎపిసోడ్లో మూడో పవరాస్త్ర కంటెండర్ కోసం ప్రిన్స్ యావర్ నిరూపించుకోగా హీరో శివాజీ బూతులూ తిడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Bigg Boss 7 Telugu September 20th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్లో మొదటి పవరాస్త్ర గెలుచుకుని ఆట సందీప్, రెండో పవరాస్త్ర సాధించి హీరో శివాజీ ఇద్దరూ పర్మనెంట్ ఇంటి సభ్యులు అయ్యారు. ఇద్దరికీ వరుసగా ఐదు, నాలుగు వారాల ఇమ్యునిటీ వచ్చింది. అయితే హీరో శివాజీ పవరాస్త్రను సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి దొంగతనం చేసి హౌజ్‌లో ఒకచోట దాచిపెట్టాడు. అలా చేస్తే శివాజీ పవరాస్ర్తకు ఉన్న పవర్ పోతుందని అమర్ దీప్ భావించాడు.
ఎవరు దొంగలించారు
తన పవరాస్త్రను దొంగతనం చేసింది ఎవరో తెలియని హీరో శివాజీ కంటెస్టెంట్స్ అందరిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. ఎవడు తీశాడో, ఎవత్తి తీసిందో.. తీసినవాళ్లను ఏం అనను, దీని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ తొక్క తీస్తా అంటూ అమ్మాయిలను ఎవత్తి అంటూ బూతులు మాట్లాడాడు శివాజీ. ఈ క్రమంలోనే ప్రియాంకతో శివాజీకి చిన్న వాగ్వాదం జరిగింది. అనంతరం ఆట సందీప్‌ను తన పవరాస్త్రను ఎవరు దొంగలించారని అడిగాడు శివాజీ.
వెంట్రుకతో సమానం
సందీప్ పవరాస్త్రను శుభ శ్రీ దొంగలించగా.. తాను ఎవరికీ చెప్పననని మాట ఇచ్చాను అని సందీప్ చెప్పాడు. నేను వాళ్లతో మాట్లాడను. నాకు చెప్పు అంతే. ఎవరు తీశారు తేజా గాడా అని శివాజీ అన్నాడు. దానికి అవును అని సందీప్ అబద్దం చెప్పాడు. దీంతో తేజానే తన పవరాస్ట్ర దొంగలించాడనుకున్న శివాజీ "వాడికి క్యారెక్టర్ లేదు. నా వెంట్రుకతో సమానం. క్యారెక్టర్ అనేది ముఖ్యం. అడుక్కుతిని ఈ వీక్‌లో సేవ్ అయ్యాడు. ఇలాటి చిల్లర గేమ్స్ ఆడకూడదు. మగాడిలా ఆడాలి" అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
కుక్క తోకలా
పల్లవి ప్రశాంత్‌తో పవరాస్ర్త దొంగతనం గురించి డిస్కషన్ పెట్టాడు శివాజీ. తేజ బుద్ధి కుక్క తోకలాంటిది. అందుకే వాడు ఎదగడం లేదు. అక్కడే ఉంటున్నాడు అని మాట్లాడాడు శివాజీ. మరోవైపు నా పవరాస్త్రను నువ్వే దొంగలించావ్ అని శివాజీకి చెప్పానని తేజాతో సందీప్ చెప్పాడు. అనంతరం కిచెన్‌లో టేస్టీ తేజా ఏదో వండుతుంటే.. కుక్క తోక ఎలా ఉంటుందిరా అని తేజను ఉద్దేశించి ప్రశాంత్‌తో శివాజీ అన్నాడు. రాయి కట్టినా సక్కగా కాదన్నా అని ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అని తేజా తనకు తెలిసి కూడా అడిగాడు. ఓ కుక్క గురించి లేరా అని శివాజీ బదులిచ్చాడు.