Bigg Boss 7 Telugu: క్షమించమంటూ షకీలా కాళ్లు మొక్కిన రతిక.. ఆమె చేసిన తప్పు ఏంటంటే?-bigg boss 7 telugu rathika touches shakeela feet for apology ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bigg Boss 7 Telugu: Rathika Touches Shakeela Feet For Apology

Bigg Boss 7 Telugu: క్షమించమంటూ షకీలా కాళ్లు మొక్కిన రతిక.. ఆమె చేసిన తప్పు ఏంటంటే?

క్షమించమంటూ షకీలా కాళ్లు మొక్కిన రతిక
క్షమించమంటూ షకీలా కాళ్లు మొక్కిన రతిక

Bigg Boss 7 Telugu Shakeela Rathika: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍ ఉల్టా పుల్టా అన్నట్లుగానే ఊహకందని విధంగా రంజుగా సాగుతోంది. ఇక సెప్టెంబర్ 15వ ఎపిసోడ్‍లో అయితే క్షమాపణ చెబుతూ షకీలాకు రతిక కాళ్లు పట్టేసుకుంది. అసలు ఏమైందనే వివరాల్లోకి వెళితే..

Bigg Boss 7 Telugu September 15th Episode: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍ సెప్టెంబర్ 15వ ఎపిసోడ్‍లో రెండో పవర్ ఆస్త్ర గెలుపు కోసం రణధీర టీమ్ అయిన శివాజీ, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంక, ప్రిన్స్ యావర్, షకీలా ఆరుగురు కంటెండర్స్ గా పాల్గొన్నారు. వారిలో శోభా శెట్టి, అమర్‍లను మహాబలి టీమ్ అనర్హులుగా చెప్పింది. తర్వాత ప్రిన్స్ యావర్‍ను కూడా అనర్హుడిగా గౌతమ్ చెప్పడంతో వారిద్దరి మధ్య బీభత్సమైన గొడవ అయింది. దాదాపు కొట్టుకునేంత పని చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఎలా అర్హురాలు

ఈ గొడవ జరిగే సమయంలోనే తాను శివాజీ, ప్రిన్స్ యావర్‍కు మాయాస్ర్త భాగాలు ఇవ్వాలని చెప్పానని, అయినా మహాబలి టీమ్ వినలేదని గట్టిగా అరుస్తూ అబద్ధాలు చెప్పింది రతిక. నిజానికి శివాజీ, షకీలాకే ముందుగా సపోర్ట్ చేసిన రతిక.. యావర్ గొడవ పడటంతో అటు ప్లేటు తిప్పింది. యావర్ కంటే షకీలా ఎలా అర్హురాలు అంటూ సొంత టీమ్‍పైనే చిందులేసింది. హౌజ్‍లో షకీలాను అందరూ షకీలా అమ్మ అని పిలుస్తారు. కానీ, రతిక ఆ ఫైట్ సమయంలో షకీలా ఎలా అర్హురాలు అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది.

ఒసే, పోవే అనొచ్చు

అనంతరం గొడవ అంతా సర్దుకున్నాకా రాత్రి సిగరెట్ తాగుతున్న షకీలా దగ్గరికి వచ్చి సారీ చెప్పింది. ఇందాక హీటింగ్ డిస్కషన్‍ జరగడంతో షకీలా కంటే యావర్ బెటర్.. షకీలా ఏం ఆడింది.. ఎందులో ఎక్కువ అంటూ కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాను. మన్నించండి అమ్మా అంటూ రతిక చెప్పింది. దీనికి నేను కూడా ఒసే, పోవే అని మాట్లాడగలను. ఏం కాదు. కానీ, అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఎలా అయినా అనొచ్చు. వెళ్లిపోవచ్చు. కానీ, అది బ్యాడ్‍గా ఉంటుంది. చూసేవాళ్లకు బాగొదు అని గట్టిగా కౌంటర్ ఇచ్చింది షకీలా.

షకీలా ఎలిమినేట్

షకీలా రియాక్షన్‍కి రతిక వెంటనే కాళ్లు పట్టేసుకుంది. షకీలా కాళ్లు మొక్కి మరి క్షమించండి అంటూ వేడుకుంది. అయ్యో.. అలా ఏం వద్దు.. అంటూ లేపింది షకీలా. తర్వాత షకీలాను హగ్ చేసుకుంటూ మళ్లీ సారీ చెప్పింది రతిక. అయితే రతిక ఫుటేజ్ కోసం ఇలా సారీ చెప్పింది అని నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 7 తెలుగు 2వ వారం షకీలా ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. కానీ, దానికి సంబంధించిన ఎపిసోడ్ ఇవాళ (సెప్టెంబర్ 17) రాత్రి టెలీకాస్ట్ కానుంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.