Bigg Boss 7 Nominations : రతిక ఎక్స్ గురించి రచ్చ రచ్చ.. మళ్లీ గరం గరం అయిన యావర్-bigg boss 7 telugu nominations shubha sree talks about rathika ex boy friend ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 7 Nominations : రతిక ఎక్స్ గురించి రచ్చ రచ్చ.. మళ్లీ గరం గరం అయిన యావర్

Bigg Boss 7 Nominations : రతిక ఎక్స్ గురించి రచ్చ రచ్చ.. మళ్లీ గరం గరం అయిన యావర్

Anand Sai HT Telugu
Sep 26, 2023 07:06 AM IST

Bigg Boss 7 Nominations : బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారం నామినేషన్స్ మెుదలయ్యాయి. కన్ఫామ్ అయిన ముగ్గురు హౌస్ మేట్స్ నామినేషన్స్ డిసైడ్ చేస్తారు. వాళ్లే జ్యూరీ సభ్యులని బిగ్ బాస్ చెప్పాడు.

బిగ్ బాస్ 7 నామినేషన్స్
బిగ్ బాస్ 7 నామినేషన్స్ (unplash)

బిగ్ బాస్ తెలుగు 7లో కాస్త వెరైటీగా నామినేషన్స్ చేయిస్తున్నాడు బిగ్ బాస్. ఇప్పటి వరకూ పవర్ అస్త్రా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కిందటి సీజన్స్ లాగా టాస్కులు, యాక్టివిటీలు అయితే పెద్దగా లేవు. ఇక తాజాగా నాలుగో వారం నామినేషన్స్ కూడా మెుదలయ్యాయి. జ్యూరీ సభ్యులుగా కన్ఫామ్ హౌస్ మేట్స్ అయిన సందీప్, శివాజీ, ప్రియాంక ఉన్నారు. కోర్టు సెట్ వేశారు. రెండు బోణులు పట్టారు. ఒక కంటెస్టెంట్ ఇద్దరినీ నామినేట్ చేయాలి. అందులో నామినేట్ చేసిన వ్యక్తి ఎవరికీ సరైన కారణాన్ని చెబుతారో వారి ఫొటోను మాత్రం తీసుకెళ్లి బోర్డుకు అతికిస్తారు. ఒకరిది మాత్రమే అలా చేస్తారు. ఒకరి ఫొటో బోర్డుపై వచ్చాక వారిని మళ్లీ నామినేట్ చేసేందుకు అవకాశం లేదు.

జ్యూరీ సభ్యులు మెుదటగా.. యావర్ ను పిలిచారు. యావర్ ప్రియాంక, టేస్జీ తేజను నామినేట్ చేశాడు. ప్రియాంకతో మళ్లీ కిందటి వారం టాస్క్ విషయంలో నామినేట్ చేసినట్టుగా చెప్పాడు. ప్రియాంక ఎదుటివారు చెప్పింది వినిపించుకోదు అని, ఆమె చెప్పింది మాత్రమే వినాలన్నట్టుగా చేస్తుందని యావర్ తెలిపాడు. కానీ ప్రియాంక దీనికి ఒప్పుకోలేదు. కిందటి వారం పవర్ అస్త్రా కోసం చేసిన ఫైట్ లో అనవసరంగా తనను పక్కన పెట్టిందని యావర్ మండిపడ్డాడు. దీనికి ప్రియాంక కూడా గట్టిగా బదులిచ్చింది. కాసేపు వీరిద్దరి మధ్య ఫైట్ నడించింది. తర్వాత టేస్టీ తేజను ఎందుకు నామినేట్ చేస్తున్నాడో కూడా యావర్ చెప్పాడు. అయితే జ్యూరీ సభ్యులు మాత్రం.. ప్రియాంకను నామినేట్ చేసి.. బోర్డుపై ఫొటో పెట్టారు.

తర్వాత వచ్చిన శుభ శ్రీ రతిక, అమర్ దీప్ ను నామినేట్ చేసింది. రతిక తన ఎక్స్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని, ఒక సెలబ్రెటీ గురించి డ్యామేజ్ చేయకూడదని బిగ్ బాస్ రూల్ ఉందని వివరించింది. పనులు కూడా సరిగా చేయడం లేదని చెప్పింది. ఈ విషయంపై రతిక సీరియస్ అయింది. నేను ప్రియాంకతో మాట్లాడుతుంటే వచ్చి ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడ ఏంటని.. అసలు నీ క్యారెక్టర్ ఏంటని ప్రశ్నించింది రతిక. నోరు అదుపులో పెట్టుకోమని శుభ శ్రీ వార్నింగ్ ఇచ్చింది.

ఇక అమర్ దీప్ గురించి శుభ శ్రీ చెబుతూ.. అమర్ దీప్ ఫ్రెండ్షిప్ గురించి ఆలోచిస్తు్న్నాడని, కంటెండర్ కోసం జరిగిన టాస్కు చేయకపోవడం తనకు నచ్చలేదని చెప్పింది. మైల్డ్ గా ఉన్నానని, వైల్డ్ గా ఆడతానని నాగర్జున ముందు చెప్పాడని కానీ తనకు అది కనిపించడం లేదని వివరించింది. హెయిర్ కట్ చేయించుకోకపోవడం నా పర్సనల్ విషయమని, నా సమస్యలు నాకు ఉన్నాయని వెల్లడించాడు అమర్ దీప్. మైల్డ్ గా ఉన్నానని చెప్పింది ప్రాస కోసమని, ఆ విషయాన్ని తీసుకొచ్చి నామినేట్ చేయడం కరెక్ట్ కాదని వివరించాడు అమర్ దీప్. జ్యూరీ సభ్యులు రతికను నామినేట్ చేసి ఫోటోను బోర్డుపై అతికించారు.

తర్వాత గౌతమ్ కృష్ణను పిలిచారు జ్యూరీ సభ్యులు. యావర్, టేస్టీ తేజను బోణులోకి పిలిచాడు. యావర్ గురించి చెబుతూ.. గతంలో తనతో అమర్యాదగా ప్రవర్తించాడని చెప్పాడు. తన కోపం వల్ల ఇతరులు హర్ట్ అవుతున్నారని వివరించాడు. దీంతో యావర్ మళ్లీ అరుపులు మెుదలుపెట్టాడు. దీంతో గౌతమ్ వెటకారంగా రియాక్ట్ అయ్యాడు. ఇక మళ్లీ కోపం తెచ్చుకున్న యావర్ బోణులో నుంచి కిందకి వచ్చాడు. గట్టిగా అరుస్తూ.. నోరు తక్కువ చేసి మాట్లాడు అంటూ.. గౌతమ్ మీదకు వెళ్లాడు. జ్యూరీ సభ్యులు ఎంత పిలిచినా యావర్ పట్టించుకోలేదు. గౌతమ్ పైకి వెళ్లి గట్టిగా మాట్లాడాడు.

ఈ క్రమంలో సందీప్ తోనూ వాగ్వాదం పెట్టుకున్నాడు యావర్. చివరకు శివాజీ గట్టిగా చెప్పడంతో బోణులోకి వెళ్లాడు. కంటెస్టెంటు చెప్పిన కారణాలతో కాకుండా.. జ్యూరీ సభ్యుల ముందు ప్రవర్తన కారణంగా యావర్ ను నామినేట్ చేస్తున్నట్టుగా చెప్పాడు శివాజీ. కాసేపటి తర్వాత బిగ్ బాస్ ఓ ట్విస్ట్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్ చెప్పిన కారణాలతో నామినేట్ చేయాలని, నామినేషన్స్ సమయంలో కంటెస్టెంట్ల ప్రవర్తన ఆధారంగా నామినేట్ చేయెుద్దని అన్నాడు. దీంతో బోర్డు నుంచి యావర్ ఫొటోను తీసేశారు. దీంతో యావర్ హ్యాపీ అంటూ ఆనందపడ్డాడు.

IPL_Entry_Point