Bigg Boss 7 Telugu Elimination: షాకింగ్ ట్విస్ట్.. ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఎవరంటే?-bigg boss 7 telugu elimination shakeela get eliminated in 2nd week ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bigg Boss 7 Telugu Elimination: Shakeela Get Eliminated In 2nd Week

Bigg Boss 7 Telugu Elimination: షాకింగ్ ట్విస్ట్.. ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఎవరంటే?

బిగ్ బాస్ 7 తెలుగు రెండో వారం ఎలిమినేషన్
బిగ్ బాస్ 7 తెలుగు రెండో వారం ఎలిమినేషన్

Bigg Boss 7 Telugu 2nd Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు ఉల్టా పుల్టా సీజన్ రెండో వారానికి వచ్చేసింది. వీకెండ్‍లో కంటెస్టెంట్లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలిసిందే. అయితే బిగ్ బాస్ 7 తెలుగు 2వ వారం ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉన్నట్లు టాక్.

ఎప్పటిలాగా కాకుండా కాస్తా డిఫరెంట్‍ అంచనాలతో ప్రారంభమైంది బిగ్ బాస్ 7 తెలుగు సీజన్. ఈ సీజన్‍లోకి మొత్తంగా 14 మంది సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. వారిలో కిరణ్ రాథోడ్ గత వారం అంటే ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే హౌజ్‍లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మరికొంతమంది సెలబ్రిటీలు వస్తారని, వచ్చే కొత్త కంటెస్టెంట్స్ లేదా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను సీక్రెట్ రూమ్‍లో ఉంచుతారని టాక్ జోరుగా వినిపించింది.

ట్రెండింగ్ వార్తలు

వారిద్దరే ఎలిమినేట్

అయితే ఆ వార్తలు వట్టి పుకార్లు అవుతాయా.. లేదా నిజం అవుతాయో చూడాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. కానీ, బిగ్ బాస్ 7 తెలుగు రెండో వారం ఎలిమినేషన్‍లో నిర్వాహకులు పెద్ద ట్విస్ట్ ఇవ్వనున్నట్లు టాక్. ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉండనుందని పలువురు రివ్యూవర్లు చెబుతున్నారు. వారిలో షకీలా, టేస్టీ తేజా చివరి రెండు స్థానాల్లో ఉన్నట్లు.. వారిద్దరే ఎలిమినేట్ కానున్నారని సమాచారం.

అధికంగా వారిద్దరికి

రెండో వారం నామినేషన్లలో పల్లవి ప్రశాంత్, శివాజీ, ప్రిన్స్ యావర్, రతిక రోజ్, అమర్ దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, షకీలా, టేస్టీ తేజ మొత్తం 9 మంది ఉన్నారు. మంగళవారం నుంచి ఓటింగ్ పోల్ పెట్టారు. వాటిలో అధికంగా ఓట్లు సంపాదించి ప్రశాంత్ మొదటి స్థానంలో ఉంటే.. శివాజీ రెండో ప్లేసులో ఉన్నాడు. ఇక చివరి రెండు స్థానాల్లో టేస్టీ తేజా, షకీలా ఉన్నారు. దీంతో వీళ్లేద్దరే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వారం నుంచే వార్తలు వస్తున్నాయి.

హౌజ్ నుంచి బయటకు

ఇక తేజా కామెడీ పెద్దగా వర్కౌట్ కావట్లేదని, అతన్ని డబుల్ ఎలిమినేషన్ కింద ఎవిక్షన్ పాస్ ఇచ్చి మరొ కొత్త కమెడియన్‍ను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ మేకర్స్ ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. ఇక ఈపాటికే షకీలా ఎలిమినేట్ అయి హౌజ్ నుంచి బయటకు వచ్చేసిందని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. కాగా అడల్ట్ చిత్రాలతో కొంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్న షకీలా బిగ్ బాస్‍ ద్వారా మంచి పేరే సంపాదించుకుంది. హౌజ్‍లో అందరూ ఆమెను అమ్మ అని పిలవడం తెలిసిందే.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.