Bigg Boss No Elimination: డబుల్ కాదు, ఈవారం నో ఎలిమినేషన్.. ఆ ఇద్దరు సేఫ్.. ఎందుకో తెలుసా?-bigg boss 7 telugu 11th week no elimination gautam ashwini safe ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss No Elimination: డబుల్ కాదు, ఈవారం నో ఎలిమినేషన్.. ఆ ఇద్దరు సేఫ్.. ఎందుకో తెలుసా?

Bigg Boss No Elimination: డబుల్ కాదు, ఈవారం నో ఎలిమినేషన్.. ఆ ఇద్దరు సేఫ్.. ఎందుకో తెలుసా?

Sanjiv Kumar HT Telugu
Nov 19, 2023 06:03 AM IST

Bigg Boss 7 Telugu 11th Week No Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని జోరుగా వార్తలు వచ్చాయి. కానీ, బిగ్ బాస్ తెలుగు ఈవారం ఎలిమినేషన్ లేదని శనివారం షూటింగ్‌లో తెలిసిపోయింది.

బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం నో ఎలిమినేషన్.. వాళ్లిద్దరు సేఫ్.. కారణాలు ఇవే!
బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం నో ఎలిమినేషన్.. వాళ్లిద్దరు సేఫ్.. కారణాలు ఇవే!

Bigg Boss 7 Telugu No Elimination: బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడూ నామినేషన్ల ప్రక్రియ మోస్ట్ ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. అరుపులు, గొడవలు, రివేంజ్‌తో సాగిపోతుంటాయి. అలా బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం కూడా నామినేషన్స్ హోరాహోరీగా సాగాయి. రెండు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ సాగింది. దీంతో బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు.

బిగ్ బాస్ తెలుగు పదకొండో వారం నామినేషన్లలో అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ,, ప్రిన్స్ యావర్ ఉన్నారు. వీరిలో ఓటింగ్ నిర్వహించిన రోజు నుంచి ప్రిన్స్ యావర్, అమర్ దీప్ చౌదరి మొదటి రెండు స్థానాల్లో ఉంటూ వచ్చారు. చివరి రెండు స్థానాల్లో గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి ఉన్నారు.

అయితే, ప్రతిసారి ఆదివారం రోజు ఎలిమినేట్ కంటెస్టెంట్‌ను ప్రకటించి హౌజ్ నుంచి పంపిస్తారు. దానికి సంబంధించిన షూటింగ్ శనివారం నాడు జరుగుతుంది. అలా ఈవారం ఎలిమినేషన్ లేదని బిగ్ బాస్ వర్గాల నుంచి సమాచారం వచ్చింది. ఆదివారానికి (నవంబర్ 19) సంబంధించిన ఎపిసోడ్‌లో ఎలిమినేషన్ ప్రక్రియ నిర్వహించారు. చివరిగా గౌతమ్, అశ్విని ఉన్నారు. వారిలో ఒకరు ఎలిమినేట్ అని చెప్పకుండా ఈవారం ఎలిమినేషన్ లేదని నాగార్జున చెప్పారు.

అందుకు సంబంధించిన షూటింగ్ శనివారం (నవంబర్ 18) రోజు పూర్తి అయింది. దాంతో ఎలిమినేషన్ లేదని స్పష్టంగా తెలిసిపోయింది. అయితే, అందుకు కారణం ప్రిన్స్ యావర్ తన ఫ్రీ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయడమే. ఫౌల్స్ చేసి గెలిచావ్ అని నవంబర్ 18న ప్రసారం చేసిన ఎపిసోడ్‌లో నాగార్జున చెప్పారు. దాంతో నాకు క్యారెక్టర్ ముఖ్యం సార్ అని ఫ్రీ ఎవిక్షన్ పాస్‌ను తిరిగి ఇచ్చేశాడు యావర్. దాన్ని బీబీ టీమ్ యాక్సెప్ట్ చేసి వెనక్కి తీసుకుంది.

ఫ్రీ ఎవిక్షన్ పాస్ ప్రిన్స్ యావర్ దగ్గర ఉంటే దాన్ని ఈవారం ఎలిమినేట్ అయ్యే వారిలో ఎవరికో ఒకరికి వాడమని చెప్పేవారు. చివర్లో గౌతమ్, అశ్వినికి బదులు ఒకరి స్థానంలో రతికను ఉంచేవారు. ప్రిన్స్ ఎలా ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తాడో టెస్ట్ చేసేవారు. యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయడంతో ఎలిమినేషన్ రద్దు చేశారు. అలాగే, శోభా శెట్టిని కూడా కాపాడేందుకు అని మరో టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే, ఈసారి నో ఎలిమినేషన్ కాబట్టి వచ్చేవారం మాత్రం కచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని సమాచారం.

Whats_app_banner