Bigg Boss Elimination: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. అందుకు పోటీ పడుతున్న ముగ్గురు కంటెస్టెంట్స్-bigg boss 7 telugu 11th week double elimination and rathika shobha will eliminate ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bigg Boss 7 Telugu 11th Week Double Elimination And Rathika Shobha Will Eliminate

Bigg Boss Elimination: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. అందుకు పోటీ పడుతున్న ముగ్గురు కంటెస్టెంట్స్

Sanjiv Kumar HT Telugu
Nov 18, 2023 06:27 AM IST

Bigg Boss 7 Telugu 11th Week Elimination: బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని సమాచారం. ఈవారం ఎలిమినేట్ అయ్యేందుకు మగ్గురు కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. వారు ఎవరనే వివరాల్లోకి వెళితే..

బిగ్ బాస్ తెలుగు ఈవారం డబుల్ ఎలిమినేషన్.. అందుకు పోటీ పడుతున్న ముగ్గురు కంటెస్టెంట్స్
బిగ్ బాస్ తెలుగు ఈవారం డబుల్ ఎలిమినేషన్.. అందుకు పోటీ పడుతున్న ముగ్గురు కంటెస్టెంట్స్

Bigg Boss 7 Telugu Voting: ఎప్పటిలానే బిగ్ బాస్ 7 తెలుగు 11వ వారం కూడా నామినేషన్స్ జోరుగా సాగాయి. రెండు రోజుల పాటు నామినేషన్ల ప్రక్రియ సాగగా.. 8 మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వారిలో అమర్ దీప్ చౌదరి, రతిక రోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ,, ప్రిన్స్ యావర్ ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు

కెప్టెన్ అయిన కారణంగా హీరో శివాజీ, అర్జున్ ఒక్కడే నామినేషన్ ఓటు వేయడంతో పల్లవి ప్రశాంత్ ఇద్దరూ మాత్రమే 11వ వారం నామినేషన్లలో లేరు. ఇక నామినేట్ కంటెస్టెంట్స్ కి ఓటింగ్ నిర్వహించారు. అది శుక్రవారం రాత్రి 12 గంటలకు క్లోజ్ అయింది. ఈ ఓటింగ్‌లో 34.11 శాతంతో మొదటి స్థానంలో ఉన్నాడు ప్రిన్స్ యావర్ ఉన్నాడు. 19.74 శాతం ఓట్లతో సీరియల్ హీరో అమర్ దీప్ చౌదరి రెండో స్థానంలో నిలిచాడు.

12.8 శాతంతో మూడో స్థానంలో రతిక రోజ్, 8.32 శాతంతో నాలుగో స్థానంలో అశ్విని, 6.94 శాతంతో ఐదో స్థానంలో ప్రియాంక, 6.5 శాతంతో అర్జున్ అంబటి ఆరో స్థానంలో ఉన్నారు. ఇక 6.33 శాతంతో గౌతమ్ కృష్ణ ఏడో స్థానం, 5.27 శాతంతో శోభా శెట్టి 8వ స్థానంతో డేంజర్ జోన్‌లో ఉన్నారు. గత కొన్ని వారాలుగా చూసుకుంటే చివరిలో ఉన్న శోభా శెట్టిని ఎలిమినేట్ చేయకుండా ఆమెకు బదులు ఇంకొకరిని బలి చేశారు.

ఈసారి కూడా శోభానే చివరిగా ఉంది. అయితే, ఏడో స్థానంలో ఉన్న గౌతమ్ కృష్ణను దాదాపుగా ఎలిమినేట్ చేసే అవకాశం లేదు. వీరందరిలో రతిక, అశ్విని, శోభా ఈ ముగ్గురు ఎలిమినేట్ కావాలని ఆడియెన్స్ ఎక్కువగా కోరుకుంటున్నారు. అంటే, ఆడియెన్స్ పరంగా మాత్రం ఎలిమినేషన్‌కు ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు. అంతేకాకుండా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని బిగ్ బాస్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. మరి ఈవారం ఎలిమినేషన్‌కు ఎవరు బలి అవుతారో చూడాలి.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.