Bigg Boss 6 Telugu 63 Episode: శ్రీహాన్ వరస్ట్ కెప్టెన్సీ - ఆదిరెడ్డి, కీర్తి సేఫ్
Bigg Boss 6 Telugu 63 Episode: బిగ్‌బాస్ శనివారం ఎపిసోడ్‌లో శ్రీహాన్ కెప్టెన్సీపై నాగార్జున ఫైర్ అయ్యాడు. కెప్టెన్‌గా ఫ్లాప్ అని పేర్కొన్నాడు. మరీనా, వాసంతి, ఇనాయా బాగా ఆడారని మెచ్చుకున్నాడు.
Bigg Boss 6 Telugu 63 Episode: బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌లో నాగార్జున రావడంతోనే రెడ్ టీమ్‌ను సోఫా వెనుక నిల్చొమని అన్నాడు. ఆ తర్వాత బ్లూటీమ్‌కు మెడల్స్ ఇవ్వాలని టీమ్ కెప్టెన్ ఆదిరెడ్డిని కోరాడు. ఫస్ట్ మెడల్ రాజ్‌కు, సెకండ్ మెడల్ ఇనాయాకు ఇచ్చాడు. మరీనా, వాసంతి, ఇనాయా పులుల మాదిరిగా గేమ్ ఆడారని నాగార్జున మెచ్చుకున్నాడు.
తప్పు ఒప్పుకున్న బాలాదిత్య...
ఆ తర్వాత బాలాదిత్య - గీతూ గొడవ గురించి నాగార్జున అడిగాడు. గీతూ కావాలనే తనను బ్లాక్‌మెయిల్ చేసిందని, అందుకే ఆమెను సిగ్గులేదా అనే మాట అనాల్సివచ్చిందని బాలాదిద్య అన్నాడు. గేమ్ విషయంలో తన వీక్‌నెస్‌తో ఆమె ఆడుకుందని బాలాదిత్య చెప్పాడు. గీతూతో బాలాదిత్య మాట్లాడిన మాటలు సరిగ్గా లేవని నాగార్జున సూచించాడు. నాగార్జున క్లారిటీ ఇవ్వడంతో తన మాటలు తప్పు అని ఒప్పుకున్నాడు బాలాదిత్య. ఆ విషయంలో బాలాదిత్య మరోసారి గీతూకు స్వారీ చెప్పాడు.
ఆదిరెడ్డికి లాస్డ్ మెడల్...
వీరిద్దరి గొడవ విషయంలో తప్పు ఎవరిదనే విషయంలో ఆడియెన్స్ పోల్ కోరాడు నాగార్జున. చాలా మంది బాలాదిత్యదే తప్పు అని తేల్చారు. స్మోకింగ్ వీక్‌నెస్ అనే ట్యాగ్ తనకు రావడం బాధ కలిగించిందని, ఇకపై స్మోకింగ్ ఎప్పుడూ చేయనని బాలాదిత్య ప్రామిస్ చేశాడు. . ఇందులో లాస్ట్ మెడల్‌ను తనకు తానే ఇచ్చుకున్నాడు ఆదిరెడ్డి. కానీ ఆదిరెడ్డి మాత్రం బాగా ఆడాడని నాగార్జున ప్రశంసించాడు.
శ్రీహాన్ టాప్...
ఆ తర్వాత రెడ్‌టీమ్‌లోని ప్లేయర్స్‌కు మెడల్స్ ఇవ్వమని లీడర్ గీతూను కోరాడు నాగార్జున. ఇందులో ఫస్ట్ మెడల్ శ్రీహాన్‌కు, రెండో మెడల్ ఫైమాకు ఇచ్చింది. రేవంత్ బాగా ఆడాడని, కానీ అగ్రెసివ్‌నెస్ అతడి వీక్‌నెస్ కావడంతో అపోజిట్ టీమ్ ఆ బలహీనతను బాగా వాడుకుందని అన్నాడు. ఆటలో ఇంకా రేవంత్ అగ్రెసివ్‌గానే ఉంటున్నాడని అన్నాడు నాగార్జున. గేమ్‌లో ఇనాయాను తోసేసిన పాత వీడియోను చూపించాడు. ఆట మీద ఉన్న ధ్యాసతో కొన్ని సార్లు కంట్రోల్ తప్పుతున్నావని నాగార్జున అతడికి క్లాస్ తీసుకున్నాడు.
శ్రీహాన్ కెప్టెన్సీ వరస్ట్
గీతూకు బాత్‌రూమ్ క్లీన్స్ చేసే పనిష్‌మెంట్ గత వారం నాగార్జున ఇచ్చాడు. ఆమెతో పనిచేయించే బాధ్యతను కెప్టెన్ శ్రీహాన్‌కు నాగార్జున అప్పగించాడు. కానీ గీతూతో పనిచేయించడంలో శ్రీహాన్ పూర్తిగా విఫలమయ్యాడు. ఆ విషయంలో శ్రీహాన్‌ను తప్పుపట్టాడు నాగార్జున. అతడికి పనిష్‌మెంట్ ఇచ్చాడు. వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్ కాలేడని చెప్పాడు. కెప్టెన్సీ విషయంలో శ్రీహాన్ పూర్తిగా ఫెయిల్ అయ్యాడని చెప్పాడు. శ్రీహాన్ కెప్టెన్సీలో అందరికి సరిగా ఫుడ్ అందలేదని నాగార్జున చెప్పాడు.
ఆదిరెడ్డి, గీతూ సేఫ్
మరోవైపు ఇనాయాకు నాగార్జున క్లాస్ ఇచ్చాడు. ఇతరులతో కమ్యూనికేట్ చేయకుండా తనను హౌజ్ టార్గెట్ చేస్తుందనే భ్రమలో ఇనాయా ఉందని నాగార్జున సీరియస్ అయ్యాడు. హౌజ్‌లో ఫుడ్ చాలా వేస్ట్ చేస్తున్నారని అందరిపై సీరియస్ అయ్యాడు. అందరూ కలిసే హౌజ్‌లో భోజనం చేయాలని నాగార్జున సూచించాడు. దానిని ఇంప్లిమెంట్ చేసే బాధ్యతను కెప్టెన్ శ్రీసత్యకు అప్పగించాడు. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారికి ఓ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఆదిరెడ్డి, కీర్తి సేఫ్ అయ్యారు.