Begins Youth Full Trailer: బీటీఎస్ బ్యాండ్‌పై రూపొందుతున్న కొరియన్ డ్రామా బిగిన్స్ యూత్ ఫుల్ ట్రైలర్ వచ్చేసింది
Begins Youth Full Trailer: కొరియాకు చెందిన పాపులర్ బ్యాండ్ బీటీఎస్ (BTS) నుంచి స్ఫూర్తి పొంది బిగిన్స్ యూత్ పేరుతో ఓ కొరియన్ డ్రామా సిరీస్ రూపొందుతోంది. ఈ సిరీస్ ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా.. 2024లోనే సిరీస్ ఓటీటీలోకి రానుంది.
Begins Youth Full Trailer: యూత్ అనే టైటిల్ తో తెరకెక్కిన కె-డ్రామా బిగిన్స్ యూత్ ఎట్టకేలకు పూర్తి ట్రైలర్ ను విడుదల చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. మొదట 2020లో విడుదల చేయాలని భావించిన ఈ సిరీస్.. ఆ తర్వాత 2023 నవంబర్ కు వాయిదా పడింది.
ఈ షో కొరియన్ బ్యాండ్ బీటీఎస్ లోని ఏడుగురు సభ్యుల జీవితాన్ని కళ్లకు కడుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బిగిన్స్ యూత్ ట్రైలర్
బీటిఎస్ యూనివర్స్ (బీయూ) అనేది హెచ్‌వైబీఈ, బిగిట్ మ్యూజిక్ రూపొందించిన బీటీఎస్ పరస్పర అనుసంధాన సంగీత వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ నుంచి ప్రేరణ పొందిన ఒక విస్తృతమైన కాల్పనిక కథ. ఇది మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ లైఫ్, హ్వా యాంగ్ యోన్ హ్వా సిరీస్ తో ప్రారంభమై టైమ్ ట్రావెల్, స్నేహం గురించి పెద్ద కథగా ఎదిగింది. ఇది వీడియోలలో మాత్రమే కాదు - గేమ్స్, వెబ్టూన్లు, ఇప్పుడు బిగిన్స్ యూత్ అనే డ్రామాగా మారింది.
ఈ కొత్త కె-డ్రామాలో ఏడుగురు హ్వాన్, సెయిన్, హోసు, డోజియోన్, హారూ, జూవాన్, జెహా ఓటి ఏడు పాత్రలను పోషిస్తున్నారు. బిగిన్స్ యూత్ ట్రైలర్ ఈ స్నేహితులను వ్యక్తిగత దృశ్యాల ద్వారా పరిచయం చేస్తుంది. ప్రతి ఒక్కరినీ వారి వ్యక్తిగత సవాళ్లను సూచించే కీలక పదంతో జతచేశారు. అంటే "త్యాగం", "రూమర్", “ఆసక్తి”, "పేదరికం," "జ్ఞాపకశక్తి," "హింస" అలాగే “రీమ్యారేజ్”.
బిగిన్స్ యూత్ రిలీజ్ ఎప్పుడు?
బిగిన్స్ యూత్ కే - డ్రామా ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా వెల్లడించలేదు. అయితే 2024లోనే ఈ షో రావడం ఖాయంగా కనిపిస్తోంది. HYBE వ్యవస్థాపకుడు, బీటీఎస్ ఎదుగుదలను దగ్గర నుంచి చూసిన బాంగ్ సి హ్యూక్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రముఖ కొరియన్ డ్రామా ప్రొడక్షన్ కంపెనీతో కలిసి బీటీఎస్ వరల్డ్ ఔట్ లుక్ ఆధారంగా ఒక డ్రామాను నిర్మిస్తున్నామని, త్వరలోనే ఈ డ్రామా రివీల్ అవుతుందని ఆయన అన్నారు.
ఈ బిగిన్స్ యూత్ లోనూ బీటీఎస్ లాగే ఏడుగురు అబ్బాయిలు ఉంటారు. వాళ్లు తమ వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్లంతా ఎలా కలిశారు? వాళ్ల మధ్య స్నేహం ఎలా చిగురించింది? ఆ స్నేహంతో వాళ్లు తమ కష్టాలు, సవాళ్లు ఎలా ఎదుర్కొన్నారన్నదే ఈ బిగిన్స్ యూత్ స్టోరీ.
బీటీఎస్ కె-డ్రామాలో ఎవరి పాత్రలో ఎవరు?
కిమ్ హ్వాన్ (కిమ్ సియోక్ జిన్)గా సియో జి హూన్
సెయిన్‌గా రో జోంగ్ హ్యూన్ (మిన్ యూన్ గి లేదా SUGA)
హోసుగా అహ్న్ జో హో (జంగ్ హో సియోక్ లేదా జె-హోప్)
డోజియన్‌గా సియో యంగ్ జూ (కిమ్ నామ్ జూన్ లేదా RM)
హరు (పార్క్ జిమిన్)గా కిమ్ యూన్ వూ
జంగ్ వూ జిన్ జువాన్ (కిమ్ టే హ్యూంగ్ లేదా వి)
జియోన్ జిన్ సియో జెహాగా (జియోన్ జంగ్‌కూక్)