NASA selects BTS songs: దటీజ్ బీటీఎస్.. నాసా లూనార్ మిషన్ కోసం మూడు సాంగ్స్ ఎంపిక-nasa selects 3 bts songs for its lunar mission ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nasa Selects Bts Songs: దటీజ్ బీటీఎస్.. నాసా లూనార్ మిషన్ కోసం మూడు సాంగ్స్ ఎంపిక

NASA selects BTS songs: దటీజ్ బీటీఎస్.. నాసా లూనార్ మిషన్ కోసం మూడు సాంగ్స్ ఎంపిక

Hari Prasad S HT Telugu
Jan 03, 2024 07:16 AM IST

NASA selects BTS songs: కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ (బుల్లెట్‌ప్రూఫ్ బాయ్ స్కౌట్స్)కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా తమ లూనార్ మిషన్ కోసం బీటీఎస్ ట్యూన్ చేసిన మూడు పాటలను ఎంపిక చేయడం విశేషం.

బీటీఎస్ బ్యాండ్ మెంబర్ ఆర్ఎం అలియాస్ కిమ్ నామ్-జూన్
బీటీఎస్ బ్యాండ్ మెంబర్ ఆర్ఎం అలియాస్ కిమ్ నామ్-జూన్ (Photo by Twitter/joonfanpage)

NASA selects BTS songs: కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ కొన్నాళ్లుగా బ్రేక్ తీసుకుంది. అయితే ఈ బ్యాండ్ రికార్డులు మాత్రం బ్రేక్ చేస్తూనే ఉంది. తాజాగా నాసా తమ రానున్న లూనార్ మిషన్ కోసం బీటీఎస్ ట్యూన్ చేసిన మూడు పాటలను సెలక్ట్ చేయడం విశేషం. సౌత్ కొరియా మిలిటరీలో తప్పనిసరిగా పని చేయాలన్న నిబంధనతో కొంతకాలంగా బ్యాండ్ కు దూరంగా ఉంటున్న గ్రూప్ మెంబర్ ఆర్ఎం చరిత్ర సృష్టించాడు.

నాసా ఎంపిక చేసిన మూడు బీటీఎస్ పాటల్లో ఆర్ఎం (కిమ్ నామ్-జూన్) సోలో సాంగ్ మూన్‌చైల్డ్ కూడా ఉంది. ది మూన్ ట్యూన్స్ ప్లేలిస్ట్ పేరుతో నాసా ఈ సాంగ్స్ లిస్ట్ క్రియేట్ చేసింది. అందులో మూన్‌చైల్డ్ తో పాటు బీటీఎస్ ట్యూన్ చేసిన స్పేస్ థీమ్ సాంగ్స్ కు కూడా చోటు కల్పించింది. మైక్రోకాస్మోస్, 134340 సాంగ్స్ కూడా ఈ ప్లేలిస్టులో ఉన్నాయి.

ఈ ఏడాది నాసా ఈ లూనార్ మిషన్ ను చేపట్టనుంది. ఈ సందర్భంగా స్పేస్ లో ప్లే చేయబోయే సాంగ్స్ లిస్టులో మూడు బీటీఎస్ సాంగ్స్ చోటు దక్కించుకున్నాయి. అయితే ఆర్ఎం సోలో సాంగ్ కూడా ఇందులో ఉండటంతో కే-పాప్ నుంచి ఈ ఘనత సాధించిన ఏకైక సోలో ఆర్టిస్ట్ గా అతడు నిలిచాడు. నాసా ఈ అనౌన్స్‌మెంట్ చేయగానే ఫ్యాన్స్ ఆర్ఎంకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.

అపోలో 11 మిషన్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది నాసా చంద్రుడి మీదికి మరో ప్రయాణం చేయనుంది. దీనికోసమే కొన్ని పాటలను ఎంపిక చేస్తోంది. స్పేస్ థీమ్ తో రూపొందిన సాంగ్స్ ఈ ప్లేలిస్ట్ లో ఉన్నాయి. దీనికి మూన్ ట్యూన్స్ అనే పేరు పెట్టారు.

అసలేంటీ బీటీఎస్?

బీటీఎస్ అంటే బుల్లెట్‌ప్రూఫ్ బాయ్ స్కౌట్స్. వీళ్లనే బ్యాంగ్టన్ బాయ్స్ అని కూడా అంటారు. ఇదొక కొరియన్ పాప్ బ్యాండ్. ఈ బాయ్ బ్యాండ్ లో మొత్తం ఏడుగురు ఉన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది ఫాలోయింగ్ ఉన్న బ్యాండ్స్ లో ఇదీ ఒకటి. 2010లో ఈ బ్యాండ్ ప్రారంభమైంది. 2013లో 2 కూల్ 4 స్కూల్ అనే ఆల్బమ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఈ బ్యాండ్ లో ఆర్ఎంతోపాటు జిన్, సుగా, జే హోప్, జిమిన్, వి, జంగ్‌కూక్ ఉన్నారు.

Whats_app_banner