Telugu News  /  Entertainment  /  Balakrishna To Launch Sandeep Krishna Michael Theatrical Trailer On This Date
సందీప్ కిష‌న్‌, విజ‌య్ సేతుప‌తి
సందీప్ కిష‌న్‌, విజ‌య్ సేతుప‌తి

Sundeep Kishan Michael Trailer: సందీప్ కిష‌న్ మైఖేల్ ట్రైల‌ర్‌ను రిలీజ్ చేయ‌నున్న బాల‌కృష్ణ

21 January 2023, 18:51 ISTNelki Naresh Kumar
21 January 2023, 18:51 IST

Sundeep Kishan Michael Trailer: సందీప్‌కిష‌న్ మైఖేల్ ట్రైల‌ర్‌ను హీరో బాల‌కృష్ణ రిలీజ్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమా ట్రైల‌ర్ ఏ రోజు రిలీజ్ కానుందంటే...

Sundeep Kishan Michael Trailer: సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న ఫ‌స్ట్ పాన్ ఇండియ‌న్ మూవీ మైఖేల్ ఫిబ్ర‌వ‌రి 3న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఇటీవ‌లే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌మోష‌న్స్‌ను చిత్ర యూనిట్ మొద‌లుపెట్టింది. ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను జ‌న‌వ‌రి 23న అగ్ర హీరో నంద‌మూరి బాల‌కృష్ణ రిలీజ్ చేయబోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

ట్రెండింగ్ వార్తలు

ఈ ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌ను భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మైఖేల్ సినిమాలో సందీప్‌కిష‌న్‌తో పాటు కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు. డిఫ‌రెంట్ లుక్‌లో విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తోన్న పోస్ట‌ర్స్ గ‌తంలో వైర‌ల్‌గా మారాయి.

గ్యాంగ్‌స్ట‌ర్ క‌థాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాకు రంజిత్ జ‌య‌కొడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్‌కిష‌న్‌కు జోడీగా మ‌జిలీ ఫేమ్ దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ మీన‌న్ విల‌న్‌గా క‌నిపించ‌బోతుండ‌గా వ‌రుణ్ సందేశ్‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వీరి క్యారెక్ట‌ర్స్ తాలూకు పోస్ట‌ర్స్‌ను ఇటీవ‌ల రిలీజ్ చేశారు.

మైఖేల్ సినిమాను ద‌క్షిణాది భాష‌ల‌తో హిందీలో ఒకేరోజు రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ సినిమాను భ‌ర‌త్ చౌద‌రి, పుస్కూర్ రామ్ మోహ‌న్ రావు నిర్మిస్తోన్నారు.