Nbk 108 Release Date: ద‌స‌రా బ‌రిలో బాల‌య్య‌- ఎన్‌బీకే 108 రిలీజ్ డేట్ క‌న్ఫామ్‌-balakrishna 108 movie release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Balakrishna 108 Movie Release Date Locked

Nbk 108 Release Date: ద‌స‌రా బ‌రిలో బాల‌య్య‌- ఎన్‌బీకే 108 రిలీజ్ డేట్ క‌న్ఫామ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 31, 2023 02:07 PM IST

Nbk 108 Release Date: బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా సినిమా రిలీజ్ డేట్‌ను శుక్ర‌వారం అనౌన్స్‌చేశారు. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు రానుందంటే...

బాల‌కృష్ణ
బాల‌కృష్ణ

Nbk 108 Release Date: ద‌స‌రా బ‌రిలో బాల‌కృష్ణ (Balakrishna) సినిమా క‌న్ఫామ్ అయ్యింది. బాల‌కృష్ణ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను జోడించి రూపొందిస్తోన్న ఈ సినిమాను ద‌స‌రాకు రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ శుక్ర‌వారం అనౌన్స్‌చేశారు.

బాల‌కృష్ణ కొత్త పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో రౌద్రంగా బాల‌కృష్ణ క‌నిపిస్తోన్నాడు. బ్యాక్‌గ్రౌండ్‌లో కాళీమాత విగ్ర‌హం ఉండటం ఆస‌క్తిని పంచుతోంది. విజ‌య‌ద‌శ‌మికి ఆయుధ‌పూజ అంటూ పోస్ట‌ర్‌పై ఉన్న క్యాప్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. బాల‌కృష్ణ‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌(Kajal Aggarwal), శ్రీలీల‌ (Sreeleela)పై కీల‌క స‌న్నివేశాల‌ను తెర‌కెక్కిస్తోన్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాతోనే తొలిసారి బాల‌కృష్ణ‌తో జోడీ క‌డుతోంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.

అంతే కాకుండా అనిల్ రావిపూడి, బాల‌కృష్ణ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మొద‌టి సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తోన్న 108వ సినిమా ఇది.

IPL_Entry_Point