Baby OTT Release : బేబీ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా?
Baby OTT Release : చిన్న సినిమాగా వచ్చి.. పెద్ద హిట్ సాధించింది బేబీ సినిమా. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. వసూళ్లలోనూ దూసుకెళ్తోంది. అయితే ఓటీటీ విడుదల కోసం చాలామంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
సాయి రాజేశ్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ(Anand Devarakonda) హీరోగా వచ్చిన చిత్రం బేబీ. ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. దీంతో వసూళ్లలోనూ దూసుకెళ్తోంది. ముఖ్యంగా యూత్ ఈ సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు. ఆనంద్ దేవరకొండతోపాటు హీరోయిన్ వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. జులై 14న విడుదలైన ఈ సినిమా.. మెుదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండో వారంలోనూ వసూళ్లతో దూసుకెళ్తోంది. కొంతమంది ప్రేక్షకులు మాత్రం.. బేబీ ఓటీటీ విడుదల(Baby OTT Release) కోసం ఎదురు చూస్తున్నారు.
నిజానికి ఈ సినిమా ఆగస్టు మెుదటి వారంలోనే ఓటీటీలోకి రావాల్సి ఉంది. కానీ సినిమా విడుదలయ్యాక.. వస్తున్న టాక్ తో ఈ తేదీని కాస్త వాయిదా వేశారు. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మెుదటి వారంలో ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఆహా ఓటీటీలోనే బేబీ సినిమా స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. ఇంకా థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తుండటంతో మరికొన్ని రోజులు ఓటీటీ విడుదలను వాయిదా వేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. వసూళ్లలో దూసుకెళ్తోంది. బేబి చిత్రాన్ని శ్రీనివాస కుమార్ (ఎస్‍కేఎన్) సుమారు 10 కోట్ల బడ్జెట్ తో తీశారు. ఇప్పుడు ఈ చిత్రం.. వసూళ్ల పంట పండిస్తోంది. 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.60.3కోట్ల గ్రాస్ కలెక్షన్‍లను వసూలు చేసింది. తక్కువ బడ్జెట్‍తో వచ్చిన ఈ మూవీ ఈ స్థాయిలో వసూళ్లను రాబడుతుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎమోషనల్ ట్రయాంగిల్ మూవీకి యూత్‍లో మంచి క్రేజ్ వచ్చింది. వైష్ణవి చైతన్య యాక్టింగ్‍ను అందరూ ప్రశంసిస్తున్నారు.
బేబీ సినిమాకు సంబంధించి.. ఓ ఆసక్తికర విషయం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, చైతన్య, విరాజ్ అశ్విన్ రెమ్యునరేషన్ మీద చర్చ నడుస్తోంది. ఆనంద్ కు రూ.80 లక్షలు, వైష్ణవికి రూ.30 లక్షలు, విరాజ్ కు రూ.20 లక్షల పారితోషికం ఇచ్చారంటూ.. పుకార్లు వస్తున్నాయి. ఇంత మంచి హిట్ అయి, డబ్బులు కలెక్ట్ చేస్తుంటే.. మరింత రెమ్యునరేషన్ ఇవ్వాలని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.