Telugu News  /  Entertainment  /  Aha Ott New Movies As The Digital Platform Grabs 3 New Tollywood Movies Digital Rights
సందీప్ కిషన్ మైఖేల్ మూవీ
సందీప్ కిషన్ మైఖేల్ మూవీ

Aha OTT New Movies: ఆ మూడు సినిమాల డిజిటల్‌ హక్కులు సొంతం చేసుకున్న ఆహా ఓటీటీ

03 January 2023, 17:24 ISTHari Prasad S
03 January 2023, 17:24 IST

Aha OTT New Movies: మూడు సినిమాల డిజిటల్‌ హక్కులు సొంతం చేసుకుంది ఆహా ఓటీటీ. కేవలం తెలుగు కంటెంట్‌ మాత్రమే ఉన్న ఏకైక ఓటీటీగా ఆహా ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.

Aha OTT New Movies: ఓవర్‌ ద టాప్ (ఓటీటీ)లు వచ్చిన తర్వాత తెలుగులోనూ చాలా కంటెంట్‌ ప్రేక్షకుల దగ్గరికి చేరుతోంది. కొత్త సినిమాలే కాదు.. వెబ్‌ సిరీస్‌లు కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే చాలా ఓటీటీలు తెలుగులో వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నాయి. ప్రైమ్‌ వీడియో, హాట్‌స్టార్, జీ5లాంటి ఓటీటీలు ఉన్నా.. కేవలం తెలుగు కంటెంట్‌ మాత్రమే అందించే ఆహా ఓటీటీ వీటిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటికే ఆహా నుంచి ఎన్నో వెబ్‌సిరీస్‌లు వచ్చాయి. దీనికితోడు ఇతర భాషల కంటెంట్‌ను కూడా తెలుగులోకి డబ్‌ చేసింది. అన్‌స్టాపబుల్‌లాంటి టాక్‌ షో కూడా సూపర్‌ హిట్‌ అయింది. ఇక ఇప్పుడు కొత్త తెలుగు సినిమాలను ప్రేక్షకులకు అందించడంలోనూ ఆహా దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఇతర ఓటీటీలతో పోటీ పడి డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంటోంది.

తాజాగా మూడు టాలీవుడ్‌ సినిమాల హక్కులు ఆహా ఓటీటీ సొంతమయ్యాయి. ఈ సినిమాలు జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వీటిలో సందీప్ కిషన్‌ నటించిన మైఖేల్ ఒకటి కాగా.. కిరణ్‌ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణు కథ, సంతోష్‌ శోభన్‌ మూవీ కల్యాణం కమనీయం సినిమాలు ఉన్నాయి.

వీటికి తోడు ఇప్పటికే ఎన్నో ఒరిజినల్‌ సినిమాలు, సిరీస్‌లను కూడా ఆహా ఓటీటీ అనౌన్స్‌ చేసింది. ఈ మూడు సినిమాలతోపాటు ఆహా ఒరిజినల్స్‌ స్ట్రీమింగ్‌ అయ్యే డేట్లను రానున్న రోజుల్లో అనౌన్స్‌ చేయనున్నారు.

ఆహాలోని షోలలో ఎక్కువగా పాపులర్‌ అయింది బాలయ్య బాబు టాక్‌ షో అన్‌స్టాపబుల్‌ అనడంలో సందేహం లేదు. ఈ షో తొలి సీజన్‌ బంపర్‌ హిట్‌ అవడంతో రెండో సీజన్‌ కూడా ప్రారంభించారు. ఈ మధ్యే ప్రభాస్‌తో చేసిన తొలి ఎపిసోడ్ స్ట్రీమ్‌ అయింది. ఇక వచ్చే శుక్రవారం (జనవరి 6) రెండో ఎపిసోడ్‌ రానుంది. త్వరలోనే పవన్‌ కల్యాణ్‌తో బాలకృష్ణ చేసిన చిట్‌చాట్‌ కూడా స్ట్రీమ్‌ అవనుంది. ఈ ఎపిసోడ్‌ షూటింగ్‌ కూడా పూర్తయింది.

టాపిక్