Baby Movie Breakeven: బేబీ మూవీ 2023 ఏడాది టాలీవుడ్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్‌లోనే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఆదివారం నాటి కలెక్షన్స్‌తో (Collections) బేబీ మూవీ లాభాల్లోకి అడుగుపెట్టినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. గత శుక్రవారం రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లోనే 21 కోట్ల గ్రాస్‌ను, పదకొండు కోట్ల యాభై లక్షలకు పైగా షేర్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం.
ఫస్ట్, సెకండ్ డేస్‌తో పోలిస్తే ఆదివారం రోజు వసూళ్లు రెట్టింపు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మూడోరోజు ఏపీ, తెలంగాణలో కలిపి ఈ మూవీ ఏడు కోట్లకుపైగా గ్రాస్, మూడు కోట్ల తొంభై లక్షల వరకు షేర్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ మూవీ నైజాం ఏరియాలో మూడు కోట్ల యాభై లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.
ఓవర్‌సీస్‌లో కోటిఅరవై లక్షల మేర వసూళ్లను సొంతం చేసుకున్నట్లు చెబుతోన్నారు. ఎనిమిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌లో రిలీజైన ఈ మూవీ ఆదివారం నాటితో పదకొండు కోట్ల యాభై లక్షలకు పైగా కలెక్షన్స్ సాధించింది.
మూడు రోజుల్లోనే నిర్మాతలకు మూడు కోట్ల వరకు లాభాలను తెచ్చిపెట్టినట్లు సమాచారం. పాజిటివ్ బజ్ కారణంగా సోమవారం కూడా ఈ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
ఆనంద్ దేవరకొండ(Anand Devarakona), వైష్ణవిచైతన్య, విరాజ్ అశ్విన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి సాయిరాజేష్ (Sai Rajesh) దర్శకత్వం వహించాడు.
ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన ఈ మూవీలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ యాక్టింగ్‌కు ప్రశంసలు లభిస్తోన్నాయి. నేటితరం యువత మనోభావాలకు అద్ధంపడుతూ స్వచ్ఛమైన ప్రేమకథగా దర్శకుడు సాయిరాజేష్ బేబీ సినిమాను తెరకెక్కించిన తీరుపై ఆడియెన్స్ నుంచి ప్రశంసలు లభిస్తోన్నాయి.