Melody from Ori Devuda: విశ్వక్ సేన్ 'ఓరి దేవుడా' చిత్రం నుంచి అదిరిపోయే మెలోడీ.. అద్భుతంగా పాడిన సిద్ శ్రీరామ్
First Single From Ori Devuda: విశ్వక్ సేన్ నటించిన తాజా చిత్రం ఓరి దేవుడా. ఈ సినిమా నుంచి రొమాంటిక్ మెలోడీ సాంగ్ విడుదలైంది. ఔననవా అంటూ సాగే ఈ పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు.
Avunanava Song from Ori Devuda: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్.. తన చిత్రాలతోనే కాదు.. యాటీట్యూడ్‌తోనూ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈ ఏడాది అతడు నటించిన అశోక వనంలో అర్జున కల్యాణం చిత్రం మంచి హిట్‌ను అందుకుంది. త్వరలో మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అదే ఓరి దేవుడా. ఈ సినిమాలో మిథిలా పాల్కర్, ఆశా భట్ హీరోయిన్లుగా చేశారు. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ వచ్చేసింది.
ఔననవా.. అంటూ సాంగే ఈ మెలోడీ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఏమని అనాలని తోచని క్షణాలివి.. ఏ మలుపు ఎదురయ్యే పయనమిదా.. ఆమని నువ్వేనని నీ జత చేరాలని.. ఏ తలపో మొదలయ్యే మౌనమిదా.. ఔననవా ఔననవా అంటూ సాగే క్యూట్ రొమాంటిక్ మెలోడీ శ్రోతలను అలరిస్తోంది. లియోన్ జేమ్స్ ఈ పాటకు స్వరాలు సమకూర్చగా.. సిద్ శ్రీరామ్ అద్భుతంగా ఆలపించాడు. రామజోగయ్య శాస్త్రీ ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు.
ఈ సినిమా లాంచ్ అయినప్పటి నుంచి అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రసాద్ వీ పొట్లూరి ఈ చిత్రానికి నిర్మాత వ్యవహరిస్తున్నారు. అశ్వత్ మారి ముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. స్టార్ హీరో వెంకటేశ్ ఇందులో దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీపావళి సందర్భంగా అక్టోబరు 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.
సంబంధిత కథనం