Bigg Boss 8 Telugu Avinash: అవినాశ్ విషయంలో ట్విస్ట్ .. అదంతా డ్రామానేనా!
Bigg Boss 8 Telugu Avinash: కడుపు నొప్పి తీవ్రంగా ఉందంటూ బిగ్‍బాస్ హౌస్ నుంచి అవినాశ్ బయటికి వెళ్లారు. కంటెస్టెంట్లు షాకై కన్నీరు పెట్టుకున్నారు. అయితే, మళ్లీ అతడు హౌస్‍లోకి రీఎంట్రీ ఇచ్చారు. అదంతా నాటకీయంగా సాగింది. ఆ వివరాలు ఇవే..
బిగ్‍బాస్ 8 తెలుగు ఎనిమిదో వారం పాపులర్ యూట్యూబర్ మహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ఆదివారం దీపావళి సందర్భంగా స్పెషల్ ఎపిసోడ్ ప్రసారమైంది. సెలెబ్రేషన్స్ తర్వాత జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో మహబూబ్ హౌస్ నుంచి ఔట్ అయ్యారు. అయితే, కడుపు నొప్పి తీవ్రంగా ఉండటంతో అవినాశ్ కూడా స్వయంగా బిగ్‍బాస్ హౌస్ నుంచి వెళ్లాడనేలా ఓ ప్రోమో వచ్చింది. అయితే, ఈ విషయంలో ట్విస్ట్ ఎదురైంది.
షాక్ ఇచ్చిన అవినాశ్.. కంటెస్టెంట్ల కన్నీరు
తన కడుపులో ప్రాబ్లం ఉందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారని, అందుకే హౌస్ నుంచి బయటికి వెళ్లిపోతున్నానంటూ అవినాశ్ చెప్పిన ప్రోమో బయటికి వచ్చింది. అతడు అలా చెప్పడంతో మిగిలిన కంటెస్టెంట్లు షాక్ అయ్యారు. కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నానని, అందుకే వెళ్లిపోతానని బాధగా అవినాశ్ చెప్పారు.
ఇది నిజమా అంటూ అవినాశ్‍తో నయని పావని ఒట్టు వేయించుకున్నారు. నిజమేనని అవినాశ్ చెప్పటంతో.. పావని కన్నీరు పెట్టుకున్నారు. అవి అంటూ ఏడ్చేశారు. విష్ణుప్రియ, హరితేజ, రోహిణి, టేస్టీ తేజ కూడా బాధపడ్డారు. అందరికీ హగ్స్ ఇచ్చి.. మిస్ యూ అంటూ హౌస్ నుంచి అవినాశ్ బయటికి వెళ్లిపోయారు.
అవినాశ్ రీఎంట్రీ
హౌస్‍లోకి అవినాశ్ మళ్లీ వచ్చేశారని బిగ్‍బాస్ లైవ్ ద్వారా వెల్లడైంది. అవినాశ్ రీఎంట్రీ ఇవ్వడంతో కొందరు హౌస్‍మేట్స్ సంతోషం వ్యక్తం చేశారు. ఎంత ఏడిపించావని విష్ణుప్రియ అన్నారు. ఏడ్చి.. ఏడ్చి నెత్తి పగిలిపోయిందని హరితేజ చెప్పారు. నయని పావని కూడా ఖుషి అయ్యారు. పోతావన్నావని దుస్తులు కూడా సర్దిపెట్టానని టేస్టీ తేజ చెప్పారు. నాటకాలు అంటూ తేజ డౌట్ వ్యక్తం చేశారు. అవినాశ్‍కు అంతా నార్మల్ అని డాక్టర్లు చెప్పారంట కదా అని తేజను రోహిణి అడిగారు. కన్నీళ్లు తుడుచుకున్నారు. ఆరోగ్య సమస్యలు అంటే తనకు భయమని, హాస్పిటల్ వైఫ్ దారుమణంటూ చెప్పారు.
నిజమా.. నాటకమా?
కడుపు నొప్పి అని, సమస్య ఉందని హెల్త్ రిపోర్టులు వచ్చాయని అవినాశ్ చెప్పడం నిజమా.. లేకపోతే డ్రామానా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. బయటికి వెళ్లిన కొన్ని గంటల్లోనే అతడు తిరిగి వచ్చేశారు. ఇప్పటి వరకు బిగ్‍బాస్ హౌస్‍లో బాగానే ఉన్న అవినాశ్ సడెన్‍గా కడుపు నొప్పి అంటూ బయటికి వెళ్లడం.. వెంటనే మళ్లీ తిరిగి వచ్చేయడం ప్రాంక్‍లా అనిపిస్తోంది. మిగిలిన కంటెస్టెంట్లను కూడా అవినాశ్ ఫూల్స్ చేశాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా అవినాశ్ ఓ షాక్ ఇచ్చి.. మళ్లీ హౌస్‍లోకి అడుగుపెట్టేశారు. ఈ విషయంపై నేటి (అక్టోబర్ 28) ఎపిసోడ్‍లో క్లారిటీ రానుంది.