Asur Season 2 Streaming Date: అసుర్ సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?-asur season 2 streaming date announced by the makers ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Asur Season 2 Streaming Date: అసుర్ సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Asur Season 2 Streaming Date: అసుర్ సీజన్ 2 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

Hari Prasad S HT Telugu
May 24, 2023 08:33 PM IST

Asur Season 2 Streaming Date: అసుర్ సీజన్ 2 వచ్చేస్తోంది. కొత్త సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఈ సిరీస్ ద్వారానే ఓటీటీలోకి అడుగుపెట్టాడు.

అసుర్ సీజన్ 2 వచ్చేస్తోంది
అసుర్ సీజన్ 2 వచ్చేస్తోంది

Asur Season 2 Streaming Date: హిందీ వెబ్ సిరీస్ లలో టాప్ రేటింగ్ సాధించిన వాటిలో ఒకటి అసుర్ (Asur). ఈ సిరీస్ తొలి సీజన్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడిక రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ను ప్రాచీన హిందూ చరిత్రకు ఆధునిక రూపునిస్తూ తీశారు. బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ ఈ సిరీస్ ద్వారానే ఓటీటీలోకి అడుగుపెట్టాడు.

వూట్ (Voot) ఓటీటీలో వచ్చిన తొలి సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అసుర్ సీజన్ 2 జూన్ 1 నుంచి జియో సినిమా (Jio Cinema)లో స్ట్రీమ్ అవనుంది. తొలి సీజన్ మూడేళ్ల కిందట రాగా.. రెండో సీజన్ ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. మొత్తానికి అసుర్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా అనౌన్స్ చేశారు.

సీజన్ 1ను ఎంతో ఉత్కంఠభరితంగా ముగించడంతో రెండో సీజన్ పై ఆసక్తి మరింత పెరిగింది. వరుస హత్యలు చేసే ఆ సీరియల్ కిల్లర్ ఎవరో తొలి సీజన్ లో పూర్తిగా రివీల్ చేయలేదు. రెండో సీజన్ లో ఆ కిల్లర్ ఎవరో తేలే అవకాశం ఉంది. అత్యంత పురాతన నగరంగా పేరుగాంచిన వారణాసి బ్యాక్‌డ్రాప్ లో ఈ అసుర్ వెబ్ సిరీస్ ను రూపొందించారు.

ఇందులో అర్షద్ వార్సీ.. ధనంజయ్ రాజ్‌పుత్ అనే సీబీఐ అధికారి పాత్రలో నటించాడు. ఈ సిరీస్ లో అర్షద్ తోపాటు అనుప్రియా గోయెంకా, బరుణ్ సోబ్టీ, రిద్ధి డోగ్రా, అమేయ్ వాఘ్ లాంటి వాళ్లు నటించారు.

Whats_app_banner

సంబంధిత కథనం