Radhe shyam | రాధేశ్యామ్‌కు భారీ నష్టం.. ప్రభాస్ కెరీర్‌లోనే డిజాస్టర్..!-as per the trade reports radhe shyam end up with box office disaster ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  As Per The Trade Reports Radhe Shyam End Up With Box Office Disaster

Radhe shyam | రాధేశ్యామ్‌కు భారీ నష్టం.. ప్రభాస్ కెరీర్‌లోనే డిజాస్టర్..!

HT Telugu Desk HT Telugu
Mar 22, 2022 03:45 PM IST

మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాధేశ్యామ్.. మిశ్రమ స్పందనలను అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రపై వసూళ్ల పరంగా కోలుకోలేని దెబ్బ పడినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్‌లోనే డిజాస్టర్ వసూళ్లను రాబట్టినట్లు సమాచారం.

రాధేశ్యామ్
రాధేశ్యామ్ (Twitter)

రెండున్నరేళ్ల విరామం తర్వాత పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సినిమా రాధేశ్యామ్. ఎన్నో అంచనాల నడుమ మార్చి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ ఈ చిత్రంపై తీవ్రంగా ప్రభావం పడినట్లు తెలుస్తోంది. ట్రేడ్ రిపోర్టుల ప్రకారం అంచనా ప్రకారం ఈ చిత్రం థియేటర్ రన్ ముగిసేనాటికి అన్ని భాషల్లో కలిపి రూ. 140 కోట్లను వసూళ్లను రాబట్టినట్లు సమాచారం. ఇంకేమి రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయిగా అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే మొత్తం బడ్జెట్ రూ.200 కోట్లు కాగా.. రూ.60 కోట్ల నష్టం వాటిల్లునట్లు ట్రేడ్ వర్గాల అంచనా.

బాక్సాఫీస్ విశ్లేషకుల సమాచారం ప్రకారం రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయిన మొదటి వారాంతం తర్వాత రికవరీ రాబట్టలేకపోయిందని పేర్కొన్నారు. వీకెండ్ ముగిసిన తర్వాత క్రమేణా వసూళ్లు తగ్గాయని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి రూ. 140 కోట్లను వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీకెండ్‌లోనే తమ సినిమా రూ.151 కోట్లు వసూలు చేసిందని చిత్ర నిర్మాతలు పేర్కొనడం గమనార్హం. ఈ సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ రూ.150 పైచిలుకు కలెక్షన్లను రాబట్టినట్లు వారు పోస్టర్‌ను విడుదల చేశారు.

యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదలైంది. హిందీ వెర్షన్‌కు అమితాబ్‌ బచ్చన్ గళాన్ని అందించగా.. తెలుగు వెర్షన్‌కు రాజమౌళి వాయిస్ ఇచ్చారు.

ప్రస్తుతం ప్రభాస్ తన తెలుగు, హిందీ ద్విభాష చిత్రమైన సలార్ సినిమా కోసం బిజీగా ఉన్నారు. కేజీఎప్ లాంటి సూపర్ హిట్‌ను అందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శృతి హాసన్ తొలిసారిగా డార్లింగ్ పక్కన జోడీ కట్టనుంది. యాక్షన్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా పాన్ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఇది కాకుండా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడు ప్రభాస్. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో దీపికా పదుకునే హీరోయిన్.

 

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్