Miss Shetty Mr Polishetty Teaser: కామెడీ టైమింగ్ ప‌ర్‌ఫెక్ట్ - మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి టీజ‌ర్ రిలీజ్‌-anushka miss shetty mr polishetty teaser out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anushka Miss Shetty Mr Polishetty Teaser Out Now

Miss Shetty Mr Polishetty Teaser: కామెడీ టైమింగ్ ప‌ర్‌ఫెక్ట్ - మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి టీజ‌ర్ రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 29, 2023 08:40 PM IST

Miss Shetty Mr Polishetty Teaser: అనుష్క‌, న‌వీన్ పొలిశెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించిన మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి టీజ‌ర్ శ‌నివారం రిలీజైంది. ఫ‌న్‌, ఎమోష‌న్స్‌తో ఈ టీజ‌ర్ తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి  మూవీ
మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మూవీ

Miss Shetty Mr Polishetty Teaser: అనుష్క సిల్వ‌ర్ స్క్రీన్‌పై క‌నిపించి ఐదేళ్లు దాటిపోయింది. లాంగ్ గ్యాప్ త‌ర్వాత మిస్ శెట్టి మిస్ట‌ర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది అనుష్క‌. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ టీజ‌ర్‌ను శ‌నివారం రిలీజ్ చేశారు.

చెఫ్‌గా అనుష్క ఎంట్రీతో టీజ‌ర్ మొద‌లైంది. ఫుడ్ ఏం మ్యాజిక్ కాదు ఇట్స్ ఏ సైన్స్ అంటూ అనుష్క టీజ‌ర్ ఆరంభంలో అనుష్క చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంటోంది. నా కూతురు ఏం సామాన్యురాలు అనుకుంటున్నావా.. ఎప్ప‌టికీ పెళ్లి చేసుకోదు అంటూ అనుష్క శెట్టి గురించి ఆమె త‌ల్లి జ‌య‌సుధ చెప్ప‌డం ఆస‌క్తిని పంచుతోంది.

ఆ త‌ర్వాత సిద్ధు అనే స్టాండ‌ప్ క‌మెడియ‌న్‌గా న‌వీన్ పొలిశెట్టి ఎంట్రీ ఇచ్చాడు. అత‌డి పంచ్ డైలాగ్స్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. వాట్ ఈజ్ యువ‌ర్ స్ట్రెంత్ అన‌గానే అవ‌కాశం ఉన్న‌ప్పుడ‌ల్లా కామెడీ చేస్తాను. యువ‌ర్ వీక్‌నెస్ అన‌గానే సిట్యూవేష‌న్‌కు సంబంధం లేకుండా కామెడీ చేస్తానంటూ అనే డైలాగ్స్ న‌వ్వుల‌ను పంచుతోన్నాయి.

మీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా అంటూ అనుష్క అడిగిన డైలాగ్‌కు కామెడీ టైమింగ్ మాత్రం ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటుంద‌ని టీజ‌ర్ చివ‌ర‌లో న‌వీన్ పొలిశెట్టి చెప్పే డైలాగ్ టీజ‌ర్‌కు హైలైట్‌గా నిలిచింది. మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి టీజ‌ర్‌ అనుష్క అభిమానుల‌తో పాటు టాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

ఈ సినిమాకు మ‌హేష్‌బాబు. పి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. ద‌ర్శ‌కుడిగా అత‌డికి ఇది రెండో సినిమా. గ‌తంలో సందీప్‌కిష‌న్‌తో రారా కృష్ణ‌య్య అనే సినిమా చేశాడు.

రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్ తెర‌కెక్కుతోన్న ఈ మూవీని యూవీ క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. అనుష్క హీరోయిన్‌గా న‌టిస్తోన్న 48వ సినిమా ఇది. కాగా న‌వీన్ పొలిశెట్టికి మాత్రం ఇది హీరోగా మూడో సినిమా మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

IPL_Entry_Point

టాపిక్