Annapoorna Photo Studio : అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా విడుదలయ్యేది అప్పుడే-annapoorna photo studio movie release on july 21 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Annapoorna Photo Studio : అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా విడుదలయ్యేది అప్పుడే

Annapoorna Photo Studio : అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా విడుదలయ్యేది అప్పుడే

Anand Sai HT Telugu
Jun 24, 2023 07:16 AM IST

Annapoorna Photo Studio Release Date : ఇటీవలి కాలంలో చిన్న సినిమాలకు క్రేజ్ బాగా పెరిగిపోతుంది. కథ బాగుంటే.. ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి అంచనాలతో రాబోతుంది అన్నపూర్ణ ఫొటో స్టూడియో. ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు.

అన్నపూర్ణ ఫొటో స్టూడియో
అన్నపూర్ణ ఫొటో స్టూడియో

చైతన్యరావు, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో(Annapoorna Photo Studio). ఈ సినిమా జూలై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నపూర్ణ ఫోటో స్టూడియో గతంలో పెళ్లిచూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని వంటి చిత్రాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ నుండి వస్తున్న 6వ చిత్రం. చందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 30 వెడ్స్ 21(30 Weds 21) ఫేమ్ చైతన్య రావు, లావణ్య ప్రధాన పాత్రలు పోషించారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ చిత్రానికి సంబంధించి.. విడుదల తేదీ ఖరారైంది. తాజా అప్‌డేట్ ప్రకారం అన్నపూర్ణ ఫోటో స్టూడియో జూలై 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మిహిర, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోలు బాగానే ఆకట్టుకున్నాయి. రాబోయే రోజుల్లో కొన్ని ఆసక్తికరమైన ప్రమోషన్‌లను నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ.. 'పల్లెటూరి నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. పీరియాడికల్ మూవీగా ఆకట్టుకుంది. దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా మలిచారు. 80ల నాటి నేపథ్యంలో సాగే సినిమా.. బావుంటుంది. సినిమా నుండి విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్, లిరికల్ సాంగ్స్‌కి మంచి స్పందన వస్తోంది. జూలై 21న మా చిత్రాన్ని విడుదల చేస్తాం.' అన్నారు.

ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించగా.. పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రఫీ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ ను జూన్ 23 రిలీజ్ చేశారు. గోదావరి ప్రాంతంలో జరిగే ఓ చిన్న, ఫన్నీ లవ్ స్టోరీనే ప్రధాన కథాంశంగా తీసుకొని ఈ మూవీని తెరకెక్కించినట్టుగా అర్థమవుతుంది. గోదావరి పక్కనుండే కపిలేశ్వరపురంలో ఓ చిన్న ఫొటో స్టూడియో. దానికి అన్నపూర్ణ ఫొటో స్టూడియో అనే పేరు ఉంటుంది. ఆ స్టూడియో హీరోది.

హీరో ఓ అమ్మాయిని చూడగానే ప్రేమలో పడతాడు. అయితే ఆమె మాత్రం అతన్ని అర్థం చేసుకోకుండా చెంపదెబ్బ కొడుతుంది. తనను అవమానించిన ఆ అమ్మాయిని చంపాలంటూ హీరోనే అనడం ఈ ట్రైలర్ ను ఆసక్తికరంగా మారుస్తుంది. ఓ డిఫరెంట్ ఫీల్ తో కనిపిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి రేపింది. ఈ సినిమాలో హీరో ఏఎన్నార్ అభిమానిగా కనిపిస్తాడు.

Whats_app_banner