Surya: హీరో సూర్య భయంకరమైనవాడు, అతని సినీ కెరీర్ ముగిసింది.. యానిమల్ నటుడి సంచలన కామెంట్స్
Babloo Prithiveeraj About Surya: తెలుగులో సైతం విపరీతమైన అభిమానులను సంపాదించున్న తమిళ స్టార్ హీరో సూర్యపై యానిమల్ మూవీ నటుడు, విలన్ బబ్లూ పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Animal Actor Babloo Prithiveeraj: పేరుకు తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల్లో కూడా బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు సూర్య. గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం, ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వంటి చిత్రాలతో ఎనలేని అభిమానులను సంపాదించుకున్నాడు. నటుడిగా ఎలాంటి పాత్రలు చేసేందుకు సిద్ధపడతాడు. నటనలో ఆయన పర్ఫెక్షన్, డెడికేషన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
అందుకు ఉదాహరణే విక్రమ్ మూవీలేని రోలేక్స్ పాత్ర. రోలేక్స్ పాత్రకు అంత పేరు తీసుకొచ్చింది సూర్య నటనే. అంతేకాకుండా కమల్ హాసన్, విజయ్ సేతుపతిలను మంచి తన రోల్ హైలెట్ అయిందంటే అందుకు ఏకైక కారణం సూర్యనే. అలాంటి సూర్యపై యానిమల్ మూవీ నటుడు, విలన్ బబ్లూ పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ఓ ఇంటర్వ్యూలో సూర్య గురించి యాంకర్ అడిగింది. అందుకు బబ్లూ పృథ్వీరాజ్.. "సూర్య హారిబుల్ (భయంకరమైనవాడు). అతను వెరీ సెల్ఫ్ సెంట్రిక్ పర్సన్ (చాలా స్వార్థపరుడు). కానీ నిబద్ధత (డెడికేటెడ్) గల నటుడు. నాకు తెలిసి అతని పీరియడ్ ఓవర్ (సినీ కెరీర్ ముగిసినట్లే) అయినట్లే" అని చెప్పుకొచ్చాడు.
ఇవన్ని మంచి విషయాలా అని యాంకర్ మళ్లీ అడిగితే.. గుడ్ అండ్ బ్యాడ్ రెండు అని బబ్లూ పృథ్వీరాజ్ తెలిపాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే పెళ్లి సినిమాతో తెలుగులో నటుడిగా చాలా పాపులర్ అయ్యాడు బబ్లూ పృథ్వీరాజ్. ఇటీవలే మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తున్నాడు. స్కంద మూవీలో నెగెటివ్ రోల్‌లో కనిపించిన పృథ్వీరాజ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీలో విలన్‌గా చేశాడు.