anasuya: అందుకే జబర్ధస్త్ కు బ్రేక్ ఇచ్చా - తొలిసారి ఓపెన్ అయిన అనసూయ-anasuya reveals the reasons behind quit jabardasth show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anasuya: అందుకే జబర్ధస్త్ కు బ్రేక్ ఇచ్చా - తొలిసారి ఓపెన్ అయిన అనసూయ

anasuya: అందుకే జబర్ధస్త్ కు బ్రేక్ ఇచ్చా - తొలిసారి ఓపెన్ అయిన అనసూయ

HT Telugu Desk HT Telugu
Aug 11, 2022 07:44 AM IST

జబర్ధస్త్ నుండి ఇటీవలే వైదొలిగింది అనసూయ. ఈ షోతో సుదీర్ఘ ప్రయాణానికి అనసూయ వీడ్కోలు పలకడంపై గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లకు పుల్ స్టాప్ పెడుతూ జబర్ధస్త్ ను వదిలిపెట్టడానికి గల కారణాలపై తొలిసారి ఓపెన్ అయ్యింది అనసూయ.

<p>అనసూయ</p>
అనసూయ (instagram)

జబర్ధస్త్ తో తొమ్మిదేళ్ల ప్రయాణాన్ని ఇటీవలే ముగించింది అనసూయ. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అనసూయ జబర్ధస్త్ నుండి వైదొలగడంపై గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇన్నాళ్లు ఈ పుకార్లపై సెలైంట్ గా ఉన్న అనసూయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో జబర్ధస్త్ ను వదిలిపెట్టడానికి గల కారణాల్ని వెల్లడించింది. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తుండటంతోనే జబర్ధస్త్ కు గ్యాప్ ఇవ్వాల్సివచ్చిందని వెల్లడించింది. జబర్ధస్త్ ను వదిలిపెట్టాలనే ఆలోచన కొత్తగా మొదలైంది కాదని రెండేళ్ల నుంచి ఈ విషయంలో ఎంతో మదన పడుతున్నానని తెలిపింది.

మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ పై తనకు చాలా గౌరవముందని అనసూయ చెప్పింది. కానీ ఈ మధ్య మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ కు కంటెస్టెంట్స్ మధ్య చాలా విభేదాలు వస్తున్నాయని, ఫ్యామిలీ లా కలిసి ఉండేవాళ్లందరూ షోను వదిలిపెట్టి వేరే దారులు వెతుక్కుంటున్నారని పేర్కొన్నది. దిష్టి తగలడంతోనే ఇలా జరుగుతున్నట్లుగా అనిపిస్తోందిదని తెలిపింది. జబర్ధస్త్ వదిలిపెట్టడానికి తాను తొలుత ధైర్యం చేయలేకపోయానని, కానీ ఆడియెన్స్ ఇచ్చిన ధైర్యం, కాన్ఫిడెన్స్ తో ముందడుగు వేశానని చెప్పింది. సినిమాల్లో మంచి అవకాశాలు వస్తుండటంతో ఆ దారినే ఎంచుకోవాలనే ఆలోచనతోనే జబర్దస్త్ కు బ్రేక్ ఇచ్చానని చెప్పింది.

‘సినిమాల్లో అవకాశాలు పెరగడంతో డేట్స్ అడ్జెస్ట్ మెంట్ చేయమని జబర్ధస్త్ నిర్వహకులను అడిగిన ప్రతిసారీ నాకోసం మిగిలిన వారందనిని ఇబ్బంది పెడుతున్నానని గిల్టీగా ఫీలయ్యేదాన్ని. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొన్నాళ్లు పూర్తిగా సినిమాలపైనే దృష్టిపెట్టాలని జబర్ధస్త్ కు దూరమయ్యా’ అని చెప్పింది. ‘జబర్ధస్త్ అనేది పూర్తిగా లైట్ హార్టెడ్ షో అని, కొన్ని సార్లు హద్దులు దాటాల్సివస్తుందని అనసూయ చెప్పింది. అలాంటి వాటిలో నన్ను చూసి చాలా మంది ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ కు లోనయ్యారు. నన్ను ఎలా అర్థం చేసుకోవాలనేది తేల్చుకోలేకపోయారు. జబర్ధస్త్, సినిమాల్లో కనిపించేది నా రియల్ క్యారెక్టర్ కాదు. నేనంటే ఏమిటో చెప్పడానికి జబర్ధస్త్ నుండి కొన్నాళ్లు బ్రేక్ తీసుకోవాలని అనుకున్నా’ అని చెప్పింది.

జబర్ధస్త్ ను బోర్ ఫీలయ్యి వదిలిపెడుతున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పింది. ఈ కామెడీ షోలో తనకు నచ్చని సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పింది అనసూయ. కానీ కామెడీని జనరేట్ చేయడం ఈజీ కాదని అందుకే, తనపై వచ్చే జోక్స్ ను కూడా ఈజీగా తీసుకున్నానని తెలిపింది.

Whats_app_banner