Anasuya | చంద్రకళగా అనసూయ.. 'ఖిలాడి'లో లుక్ ఇదే
Anasuya Bharadwaj movies | పుష్పతో అలరించిన అనసూయ.. ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న ఖిలాడి చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాలో అనసూయ పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది.
బుల్లితెరపై యాంకర్‌గా అలరిస్తూనే.. మరోవైపు సినిమాల్లోనూ డిఫరెంట్ పాత్రలు చేస్తోంది అనసూయ. సుకుమార్ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘పుష్ప’ సినిమాలో దాక్షాయణిగా.. నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించింది. ఇక ఇప్పుడు.. రవితేజ హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’లో అనసూయ ఓ కీలక పాత్రను చేస్తోంది. సినిమాకు సంబంధించి.. ఆమె లుక్‌ను శుక్రవారం నిర్మాణ సంస్థ విడుదలచేసింది. చంద్రకళ పాత్రలో అనసూయ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ పోస్టర్లో నలుపు రంగు చీరలో సిగ్గు ఒలకబోస్తూ అనసూయ కనిపించింది. బ్రాహ్మణ యువతిగా నెగెటివ్, పాజిటివ్ షేడ్స్‌లో ఆమె క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్లో కనిపించనున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో.. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. కొనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదలకానుంది.
గతంలో రవితేజ, రమేష్‌వర్మ కలయికలో '‘వీర'’ సినిమా రూపొందింది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత మళ్లీ వీరిద్దరు కలిసి చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా ఆయన సోదరుడు సాగర్ డైలాగ్స్ రాశారు.
అనసూయకు క్రేజీ ఆఫర్స్!
కాగా అనసూయ ప్రస్తుతం ‘ఆచార్య’, ‘పక్కా కమర్షియల్‌తో పాటు కృష్ణ వంశీ ‘రంగమార్తాండ’ సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తోంది. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న ‘భీష్మపర్వం’ సినిమాతో మలయాళీ చిత్రసీమలోకి ఈ ఏడాది అరంగేట్రం చేయబోతోంది అనసూయ.