Ananya Panday Smoking: ఏంటి అనన్యా ఈ దారుణం.. సిగరెట్ కాలుస్తూ కెమెరాకు చిక్కిన లైగర్ బ్యూటీ-ananya panday smoking photo gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ananya Panday Smoking: ఏంటి అనన్యా ఈ దారుణం.. సిగరెట్ కాలుస్తూ కెమెరాకు చిక్కిన లైగర్ బ్యూటీ

Ananya Panday Smoking: ఏంటి అనన్యా ఈ దారుణం.. సిగరెట్ కాలుస్తూ కెమెరాకు చిక్కిన లైగర్ బ్యూటీ

Hari Prasad S HT Telugu

Ananya Panday Smoking: ఏంటి అనన్యా ఈ దారుణం అంటున్నారు అభిమానులు. ఈ లైగర్ బ్యూటీ సిగరెట్ కాలుస్తూ దొరికిపోయింది. ఇప్పుడీ ఫొటో వైరల్ అవుతోంది.

పెళ్లి వేడుకలో స్మోక్ చేస్తున్న అనన్యా పాండే

Ananya Panday Smoking: అనన్యా పాండే.. లైగర్ మూవీతో తెలుగు వాళ్లకు దగ్గరైన బాలీవుడ్ సరుకు. పర్సనాలిటీ చిన్నదే అయినా తన క్యూట్ లుక్స్, స్మైల్ తో అభిమానులను ఆకర్షించింది. అయితే ఇప్పుడీ బ్యూటీ నెగటివ్ వార్తలతో తిట్లు తింటోంది. ఇప్పుడీ ముద్దుగుమ్మ తన కజిన్ అలనా పాండే పెళ్లి వేడుకల్లో బిజీగా ఉంది. ఈ వేడుకకు ఓ అదిరిపోయే లెహెంగాలో వచ్చింది.

అయితే అదే లెహెంగాలో మెహెందీ సెర్మనీలో పార్టిసిపేట్ చేసిన అనన్యా.. సిగరెట్ కాలుస్తూ కనిపించింది. పెళ్లి ఫొటోలు తీస్తుండగా.. అందులో ఓ మూల ఆమె నోట్లో సిగరెట్ పెట్టుకొని కనిపించింది. ఓ రెడిట్ యూజర్ ఈ ఫొటోను షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో ఆ ఫొటోను తర్వాత డిలీట్ చేయాల్సి వచ్చింది. అయితే అంతలోపే స్క్రీన్ షాట్ తీసేసి వైరల్ చేశారు.

మంగళవారం మెహెందీ వేడుకల సందర్భంగా ఇది జరిగింది. అనన్యా ఇలా స్మోక్ చేస్తుందని ఊహించలేదు అని సదరు రెడిట్ యూజర్ కామెంట్ చేశారు. పెళ్లి పనుల్లో అందరూ బిజీగా ఉండగా.. ఓ గ్రూపుతో కలిసి ఓ మూలకు నిల్చొన్న అనన్యా సిగరెట్ కాలుస్తూ కనిపించింది. సోషల్ మీడియాలో ఈ ఫొటోపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.

డబ్బున్న వాళ్లు, సెలబ్రిటీల ఇళ్లలో ఇలాంటి సహజమే అయినా.. ఇలా ఫొటోలు బయటకు వచ్చినప్పుడే రచ్చ రచ్చ అవుతుంది. అనన్యను ఇప్పుడు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నా అనన్యా ఇలా ఉంటుందనుకోలేదు అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. అంత అందంగా ఉంటుంది.. అంత మంచి పెదాలు ఉంటాయి.. ఆమె స్మోక్ చేయడమేంటని మరో యూజర్ అనడం విశేషం.

ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపే అనన్యా ఇలా చేయడమేంటని కూడా మరికొందరు అంటున్నారు. ఈ మెహెందీ వేడుకలకు వెళ్లే ముందు ఆమె ఇంటి బయట కెమెరాలకు పోజులిచ్చింది. లెహెంగాలో ఎప్పటిలాగే ఆమె చాలా క్యూట్ గా కనిపించింది.