Baby Movie OTT Platform: బేబీ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Baby Movie OTT Platform: బేబీ మూవీ డిజిటల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ సంస్థ సొంతం చేసుకున్నది. ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు రిలీజయ్యే అవకాశం ఉందంటే...
Baby Movie OTT Platform: ఆనంద్‌దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరోహీరోయిన్లుగా నటించిన బేబీ మూవీ పెయిడ్ ప్రీమియర్స్‌తోనే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. స్వచ్ఛమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమాకు సాయిరాజేష్ దర్శకత్వం వహించాడు.
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య యాక్టింగ్‌తో పాటు కథ, కథనాలు, మ్యూజిక్ బాగున్నాయంటూ ఆడియెన్స్ నుంచి ప్రశంసలు కురుస్తోన్నాయి. పాజిటివ్ టాక్ నేపథ్యంలో ఈ సినిమా ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా ఆహా తో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఆగస్ట్ మూడు లేదా నాలుగో వారంలో బేబీ మూవీ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
తొలి ప్రేమ గొప్పతనానికి నేటి తరం యువత ఆలోచనలను, అభిప్రాయాలను జోడిస్తూ దర్శకుడు సాయిరాజేష్ ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాలో ఆటోడ్రైవర్‌గా ఆనంద్ దేవరకొండ కనిపించగా, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ పాత్రలో వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించారు.
ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో వైష్ణవి చైతన్య తన యాక్టింగ్‌తో ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది. యూబ్యూబర్ అయిన వైష్ణవి చైతన్య బేబీ మూవీతోనే హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ కూడా మెచ్యూర్డ్ యాక్టింగ్‌ను కనబరిచాడని అంటున్నారు. బేబీ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని అందించాడు.