Amitabh Bachchan: రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో అమితాబ్ బచ్చన్.. ఫొటో వైరల్-amitabh bachchan spotted at rayadurgam metro station in hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amitabh Bachchan: రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో అమితాబ్ బచ్చన్.. ఫొటో వైరల్

Amitabh Bachchan: రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో అమితాబ్ బచ్చన్.. ఫొటో వైరల్

HT Telugu Desk HT Telugu

Amitabh Bachchan: బాలీవుడ్‌ షెహన్‌షా అమితాబ్‌ బచ్చన్‌ మన హైదరాబాద్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో కనిపించిన ఫొటో ఒకటి వైరల్‌గా మారింది. మరి అతడు అక్కడికి ఎందుకెళ్లాడు?

రాయదుర్గం మెట్రో స్టేషన్ లో అమితాబ్ బచ్చన్ (Twitter)

ఈ మధ్య హైదరాబాద్‌కు బాలీవుడ్‌ స్టార్ల తాకిడి పెరిగింది. సల్మాన్‌ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌, ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్‌.. ఇలా స్టార్లంతా భాగ్యనగరానికి క్యూ కడుతున్నారు. సల్మాన్‌ తన మూవీ షూటింగ్‌ కోసం రాగా.. ఆమిర్‌, అమితాబ్‌ ప్రైవేట్‌ పార్టీల్లో పాల్గొనడానికి వచ్చారు. ఇంతకుముందే యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో కలిసి అమితాబ్‌ బచ్చన్‌ వైజయంతీ మూవీస్‌ కొత్త ఆఫీస్‌ ప్రారంభించిన వీడియో వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

ఈ ఈవెంట్‌లో ప్రభాస్‌తోపాటు నాని, నాగ్‌ అశ్విన్‌, ప్రశాంత్‌ నీల్‌, దుల్కర్‌ సల్మాన్‌లాంటి వాళ్లతో బిగ్‌ బీ సందడి చేశాడు. ఈ వీడియోను బుధవారం (జూన్‌ 29) వైజయంతీ మూవీస్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఇక ఇప్పుడు అమితాబ్‌ బచ్చన్‌ ఓ సాధారణ పౌరుడిలా హైదరాబాద్‌లోని రాయదుర్గం మెట్రో స్టేషన్‌లో కనిపించిన ఫొటో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ ఫొటోను ఓ మెట్రో యూజర్‌ సోషల్‌ మీడియోలో పోస్ట్‌ చేశాడు. "అమితాబ్‌ ఓ షూటింగ్ కోసం వచ్చినట్లు కనిపించాడు. ఒక బ్లూ లైన్‌ రైలు అక్కడ ఉంది. కానీ ఎవరినీ ఎక్కనీయలేదు. నేను అమీర్‌పేట్‌లో ఉన్న సమయంలో మెట్రో ఈ డమ్మీ ట్రైన్‌ను ఎందుకు నడిపిస్తుందా అనుకున్నాను. అప్పుడు అమితాబ్‌ కనిపించలేదు కానీ ట్రైన్‌లో చాలా మంది కెమెరా వాళ్లు, అధికారులు కనపించారు" అని సదరు యూజర్‌ వెల్లడించాడు.

బిగ్‌ బీ మంగళవారం సాయంత్రం ఇలా మెట్రో స్టేషన్‌లో కనిపించాడు. చాలా మంది అతన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అమితాబ్‌ ఓ ట్రైన్‌ సీక్వెన్స్‌లో నటించడానికి ఇక్కడికి వచ్చాడని తెలిసింది.

సంబంధిత కథనం