Allu Arjun Movie: అల్లు అర్జున్ డిజాస్టర్ మూవీ 4కే వెర్షన్ రిలీజ్ - థియేటర్, ఓటీటీ కాదు డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే!
Allu Arjun Movie: అల్లు అర్జున్ హ్యాపి మూవీ 4కే హెచ్‌డీ వెర్షన్ డైరెక్ట్‌గా గీతా ఆర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌లో రిలీజైంది. కరుణాకరణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జెనీలియా హీరోయిన్‌గా నటించింది.
Allu Arjun Movie: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన హ్యాపి మూవీ 4కే హెచ్‌డీ వెర్షన్ రిలీజైంది. థియేటర్, ఓటీటీ కాకుండా నేరుఘౄ యూట్యూబ్ ద్వారా హెచ్‌డీ వెర్షన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. గీతా ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్‌లో హ్యాపి మూవీ 4కే వెర్షన్‌ను ఆదివారం రిలీజ్ చేశారు.
తమిళ మూవీ రీమేక్...
రొమాంటిక్ కామెడీ లవ్‌స్టోరీగా తెరకెక్కిన హ్యాపి మూవీకి కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీలో మనోజ్ బాజ్‌పాయ్, కాంతార కిషోర్, దీపక్ షిర్కే కీలక పాత్రలు పోషించారు. తమిళ మూవీ అళగీయా తీయే సినిమాకు రీమేక్‌గా హ్యాపి మూవీని కరుణాకరణ్ తెరకెక్కించాడు.
అల్లు అర్జున్ కామెడీ టైమింగ్...
అల్లు అర్జున్ కామెడీ టైమింగ్, యువన్ శంకర్ రాజా అందించిన పాటలు బాగున్నా...రొటీన్ స్టోరీలైన్ కారణంగా తెలుగు ఆడియెన్స్‌ను హ్యాపి మెప్పించలేకపోయింది. మలయాళంలోకి హ్యాపి ది లయన్ టైటిల్‌తో డబ్ చేయగా అక్కడ మాత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. థియేటర్లలో 175 రోజులకుపైగా ఆడింది.
హ్యాపి మూవీలో అల్లు అర్జున్‌కు జోడిగా జెనీలియా నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అర్జున్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు.
బన్నీ, మధుమతి ప్రేమకథ..
బన్నీ (అల్లు అర్జున్) పిజ్జాడెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. మధుమతి (జెనీలియా) ఎంబీబీఎస్ చదువుతుంటుంది. మధుమతి తండ్రి సూర్యనారాయణ (దీపక్ షిర్కే) ఓ ఎమ్మెల్యే. కూతురికి పోలీస్ ఆఫీసర్‌తో (మనోజ్ బాజ్‌పేయ్) పెళ్లి కుదుర్చుతాడు సూర్యనారాయణ. బన్నీ, తాను ప్రేమించుకున్నట్లు పోలీస్ ఆఫీసర్‌తో అబద్ధం ఆడుతుంది మధుమతి.
వారి మాటలు నిజమని నమ్మిన ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాడు? ఆ పెళ్లి కారణంగా మధుమతి తన కుటుంబానికి దూరమవుతుంది? ఆ తర్వాత ఏమైంది? ఒకరంటే మరొకరికి ఇష్టం లేకుండా పెళ్లిచేసుకున్న బన్నీ, మధుమతి ఎలా ఒక్కటయ్యారన్నది కామెడీ, ఎమోషన్స్‌తో ఈ మూవీలో కరుణాకరణ్ చూపించాడు.
డిసెంబర్ 6న పుష్ప...
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా చేస్తోన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కాబోతోంది. తొలుత ఈ మూవీని ఆగస్ట్ 15న రిలీజ్ చేయాలని మేకర్స్ భావించారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు డిలే కావడంతో పుష్ప 2ను వాయిదావేశారు.
పుష్ప 2లో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. పుష్ప పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద నాలుగు వందల కోట్ల వరకు వసూళ్లను రాబట్టడమే కాకుండా రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. పుష్ప రాజ్ పాత్రలో అసమాన నటనకు గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ పుష్ప 2ను నిర్మిస్తోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో…
పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ ఓ మూవీ చేయనున్నాడు అల్లు అర్జున్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కతోన్నట్లు సమాచారం. డైరెక్టర్లు సందీప్ వంగా, బోయపాటి శ్రీను, అట్లీలతో అల్లు అర్జున్ సినిమాలు చేయాల్సివుంది.