Action Thriller OTT: నెల రోజుల్లోనే ఓటీటీలోకి అల్లు అర్జున్ ఫ్రెండ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ
Action Thriller OTT: అల్లు అర్జున్ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ధీరన్ హీరోగా నటించిన తమిళ మూవీ సాలా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.
Action Thriller OTT: తమిళ మూవీ సాలా థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. సాలా మూవీతో ధీరన్ హీరోగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ తమిళ మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించాడు. ఎస్‌డి మణిపాల్ దర్శకత్వం వహించాడు. ఆగస్ట్ 23న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
ఆహా ఓటీటీ...
సాలా మూవీ థియేటర్లలో రిలీజైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి వస్తోంది. సెప్టెంబర్ 20 నుంచి ఆహా తమిళ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులోనూ డైరెక్ట్‌గా ఓటీటీలో ఈ మూవీ విడుదల కానున్నట్లు సమాచారం. ఆహా ఓటీటీ ద్వారానే సాలా మూవీ తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
అల్లు అర్జున్ ఫ్రెండ్...
సాలా మూవీలో హీరోగా నటించిన ధీరన్ అల్లు అర్జున్‌కు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. ఈ ఫ్రెండ్‌షిప్‌తోనే సాలా ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ధీరన్, తాను ఒకే స్కూల్‌లో చదువుకున్నామని, తన బెస్ట్ ఫ్రెండ్స్‌లో ధీరన్ ఒకరని అల్లు అర్జున్ ప్రమోషన్స్‌లో చెప్పాడు. ధీరన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడని అల్లు అర్జున్ అన్నాడు. సాలా మూవీ ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్ పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా...
సాలా మూవీలో రేష్మి వెంకటేష్ హీరోయిన్‌గా నటించింది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలోని యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నా కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.
సాలా కథ ఇదే...
గుణా (అరుళ్‌దాస్) ఓ గ్యాంగ్‌స్టర్. ఓ ఎటాక్‌లో శత్రువుల బారి నుంచి గుణాను సాలా(ధీరన్) కాపాడుతాడు. ఆ అభిమానంతో సాలాను పెంచి పెంచి పెద్దచేస్తాడు గుణా. రాయపురంలోని పార్వతీబార్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని సాలా ప్రయత్నాలు చేస్తోంటాడు. ఆ బార్ తంగదురై అనే రౌడీ షీటర్ ఆధీనంలో ఉంటుంది. ఆ బార్ దక్కించుకోవడం సాలా ఏం చేశాడు.
ఆ బార్‌తో అతడికి ఉన్న అటాచ్‌మెంట్ ఏంటి? మద్యపానం నిషేదించాలని పోరాటం చేస్తోన్న పునీతతో (రేష్మి వెంకటేష్) సాలాకు ఎలా పరిచయం ఏర్పడింది? తన లక్ష్యం కోసం పునీతను సాలా ఎలా పావుగా వాడుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ.
నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్…
నార్త్ చెన్నై ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు మణిపాల్ ఈ మూవీని తెరకెక్కించాడు. అక్కడి సామాజిక పరిస్థితులను, చిన్నతనంలోనే క్రైమ్ బారిన పడి కొందరు యువత ఎలా చెడిపోతున్నారనే సందేశాన్ని యాక్షన్ అంశాలతో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు.