Ugram Trailer Release: విశ్వరూపం చూపించిన అల్లరి నరేష్.. 'ఉగ్రం'తో ఉరిమాడు-allari naresh starred ugram movie trailer out now ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allari Naresh Starred Ugram Movie Trailer Out Now

Ugram Trailer Release: విశ్వరూపం చూపించిన అల్లరి నరేష్.. 'ఉగ్రం'తో ఉరిమాడు

Maragani Govardhan HT Telugu
Apr 21, 2023 07:20 PM IST

Ugram Trailer Release: అల్లరి నరేష్ నటించిన సరికొత్త చిత్రం ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇంటెన్స్, గ్రిప్రింగ్‌గా ఉన్న ఈ ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. మే 5న ఈ మూవీ విడుదల కానుంది.

ఉగ్రం ట్రైలర్ విడుదల
ఉగ్రం ట్రైలర్ విడుదల

Ugram Trailer Release: కామెడీ చిత్రాలకు పెట్టింది పేరుగా ఉన్న అల్లరి నరేష్.. నాంది సినిమాతో ట్రాక్ మార్చి కంటెంట్ బేస్డ్ చిత్రాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఆ సినిమా సూపర్ హిట్టయింది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఉగ్రం సినిమాతో రాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఉగ్రం మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఉగ్రం మూవీలో అల్లరి నరేష్ పోలీసు అధికారిగా కనిపించారు. ట్రైలర్ ఆద్యంతం ఇంటెన్స్‌, రివిటింగ్‌గా సాగింది. ఇందులో సినిమా కథాంశాన్ని రివీల్ చేశారు మేకర్స్. నగరంలో మిస్సింగ్ కేసుల వెనక ఉన్న కొంతమంది పవర్‍‌ఫుల్ వ్యక్తులపై నిజాయితీ కలిగిన ఓ పోలీస్ అధికారి భారీ రిస్క్ తీసుకొని చేసిన పోరాటమే ఈ చిత్ర కథాంశంగా తెలుస్తోంది. మరి ఈ పోరాటంలో హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? నేరస్థులను పట్టుకోడానికి అతడేం చేశాడు? లాంటివి తెలియాలంటే మూవీ విడుదలయ్యేంత వరకు వేచి ఉండాల్సిందే.

అల్లరి నరేష్ ఇంతకుముందెన్నడు చూడనంత ఫెరోషియస్‌గా కనిపించాడు. ముఖ్యంగా ట్రైలర్‌లో కనిపించి రెండో లుక్‌లో ఇంటెన్స్‌గా కనిపించాడు. విజయ్ కనకమేడల నరేష్ పాత్రను చాలా ఆసక్తికరంగా, ఇంటెన్స్ ప్రెజెంట్ చేశాడని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీని మేకర్స్ చాలా గ్రాండ్‌గా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో విజయ్-నరేష్ కాంబినేషన్‌లో మరో హిట్ ఆశిస్తున్నారు సినీ ప్రేక్షకులు.

ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సహా దర్శకత్వ బాధ్యతలను విజయ్ కనకమేడల నిర్వర్తించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మే 5న ప్రపంచ వ్యాప్తంగాప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

IPL_Entry_Point