Ugram Title Song release: ఉగ్రం టైటిల్ సాంగ్ రిలీజ్.. పాటలోనే ఉగ్రరూపం చూసిన అల్లరి నరేష్-allari naresh new movie ugram powerful title song released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Allari Naresh New Movie Ugram Powerful Title Song Released

Ugram Title Song release: ఉగ్రం టైటిల్ సాంగ్ రిలీజ్.. పాటలోనే ఉగ్రరూపం చూసిన అల్లరి నరేష్

ఉగ్రం టైటిల్ సాంగ్ విడుదల
ఉగ్రం టైటిల్ సాంగ్ విడుదల

Ugram Title Song release: అల్లరి నరేష్ హీరోగా నటించిన ఉగ్రం సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ నుంచి పవర్ ఫుల్ టైటిల్ ట్రాక్‌ విడుదల చేసింది చిత్రబృందం. ఉగ్రం మే 5న విడుదల కానుంది.

Ugram Title Song release: నాంది చిత్రంతో అల్లరి నరేష్ తన ట్రాక్ మార్చి కంటెంట్ బేస్డ్ చిత్రాలను ఎంచుకుంటున్నారు. విభిన్నమైన జోనర్లను టచ్ చేస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన నాంది సూపర్ హిట్‌గా నిలవడంతో ఇప్పుడు అదే డైరెక్టర్‌తో ఉగ్రం మరో సినిమా చేస్తున్నారు అల్లరి నరేష్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రెస్పాన్స్‌ను అందుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధింది అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఉగ్రం సినిమా నుంచి పవర్‌ఫుల్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

ఉగ్రం టైటిల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. గూస్ బంప్స్ తెచ్చే ఎమోషన్‌తో ఈ పాట అద్భుతంగా ఉంది. శ్రీ చరణ్ పాకాల టైటిల్ ట్రాక్‌ను హైలీ పవర్‌ఫుల్‌ నెంబర్‌గా కంపోజ్ చేశారు. చైతన్య ప్రసాద్ ఈ పాటకు శక్తిమంతమైన లిరిక్స్ అందించారు. శ్రీచరణ్ పాకాల ఈ పాటకు సంగీతం అందించడమే కాకుండా స్వయంగా తన గాత్రంతో ఆలపించారు. అల్లరి నరేష్ తన ఇంటెన్సివ్, గ్రిప్రింగ్ లుక్‌తో అదరగొట్టారు. విజువల్స్ పాటను మరింత హైలెట్ చేశాయి.

ఇటీవలే విడుదలైన ఉగ్రం ట్రైలర్‌లో అల్లరి నరేష్ ఇంతకుముందెన్నడు చూడనంత ఫెరోషియస్‌గా కనిపించాడు. ముఖ్యంగా ట్రైలర్‌లో కనిపించి రెండో లుక్‌లో ఇంటెన్స్‌గా కనిపించాడు. విజయ్ కనకమేడల నరేష్ పాత్రను చాలా ఆసక్తికరంగా, ఇంటెన్స్ ప్రెజెంట్ చేశాడని ఈ ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మూవీని మేకర్స్ చాలా గ్రాండ్‌గా రూపొందించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన మిర్నా హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే సహా దర్శకత్వ బాధ్యతలను విజయ్ కనకమేడల నిర్వర్తించారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మే 5న ప్రపంచ వ్యాప్తంగాప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.