Agent Movie Update: తుది దశలో ఏజెంట్.. భారీ ఫైట్ సీక్వెన్సే బ్యాలెన్స్..!
Agent Movie Update: అఖిల్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. విదేశాల్లో ఓ షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది.
Agent Movie Update: టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సక్సెస్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా మొదలుపెట్టినప్పటికీ ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. గతేడాదే చిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. అది కాస్త సమ్మర్‌కు వాయిదా పడింది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.
ఇందులో భాగంగా విదేశాల్లో ఓ షెడ్యూల్‌ను ప్లాన్ చేసిందట చిత్రబృందం. అక్కడ ఫైట్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనుందట. ఈ వారంలోనే చిత్ర యూనిట్ అంత పారిన్ వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ షెడ్యూల్‌తో ఏజెంట్ షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇంతకముందెన్నడు చూడని విధంగా అఖిల్ తన రూపాన్ని మార్చుకున్నాడు. నటనలో పరిణితి, యాక్షన్ సన్నివేశాలకు తగినట్లుగా బాడీ లాంగ్వేజ్‌ను అభివృద్ధి చేసుకున్నాడు. ఈ సినిమా తప్పకుండా అఖిల్ కెరీర్‌లో బెస్ట్ మూవీ అవుతుందనిపిస్తోంది.
ఏజెంట్ చిత్రాన్ని తొలుత సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పెండింగ్ ఉండటంతో వేసవికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఏప్రిల్ 28న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సైరా లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్