Top IMDb adventure movies on ott: ఓటీటీల్లోని టాప్ ఐఎండీబీ రేటింగ్ అడ్వెంచర్ మూవీస్ ఇవే..-adventure movies on ott top imdb rated adventure movies in netflix prime video disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Top Imdb Adventure Movies On Ott: ఓటీటీల్లోని టాప్ ఐఎండీబీ రేటింగ్ అడ్వెంచర్ మూవీస్ ఇవే..

Top IMDb adventure movies on ott: ఓటీటీల్లోని టాప్ ఐఎండీబీ రేటింగ్ అడ్వెంచర్ మూవీస్ ఇవే..

Hari Prasad S HT Telugu
Apr 30, 2024 10:49 AM IST

Top IMDb adventure movies on ott: అడ్వెంచర్ మూవీస్ అంటే మీకు ఇష్టమా? అయితే ఓటీటీల్లో ఉన్న టాప్ ఐఎండీబీ రేటెడ్ అడ్వెంచర్ సినిమాలను అస్సలు మిస్ కావద్దు.

ఓటీటీల్లోని టాప్ ఐఎండీబీ రేటింగ్ అడ్వెంచర్ మూవీస్ ఇవే..
ఓటీటీల్లోని టాప్ ఐఎండీబీ రేటింగ్ అడ్వెంచర్ మూవీస్ ఇవే..

Top IMDb adventure movies on ott: అడ్వెంచర్ సినిమాలను మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. మనలో అడ్రినలిన్ స్థాయిలను పెంచే ఈ సినిమాలను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. మరి మీకు కూడా అలాంటి అడ్వెంచర్ మూవీస్ అంటే ఇష్టమా? అయితే ప్రస్తుతం ఓటీటీల్లో ఉన్న టాప్ ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) రేటింగ్ ఉన్న సినిమాలను చూసేయండి.

టాప్ ఐఎండీబీ రేటెడ్ అడ్వెంచర్ మూవీస్

అడ్వెంచర్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ లోనే వస్తుంటాయి. ఈ సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొట్టడమే కాదు.. ప్రేక్షకుల మెప్పు పొంది మంచి ఐఎండీబీ రేటింగ్ సాధించిన సినిమాలు కూడా ఈ జానర్ లో ఉన్నాయి.

ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ద రింగ్ - నెట్‌ఫ్లిక్స్

ది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫ్రాంఛైజీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. అయితే ఈ సిరీస్ నుంచి 2001లో వచ్చిన లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ది ఫెలోషిప్ ఆఫ్ ద రింగ్ మూవీకి అత్యధికంగా 8.9 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ తోపాటు ప్రైమ్ వీడియో, జియో సినిమాలోనూ అందుబాటులో ఉంది.

ఇంటర్‌స్టెల్లార్ - ప్రైమ్ వీడియో

ఇంటర్‌స్టెల్లార్ మూవీ తారాలోకంలో చేసే ఓ అడ్వెంచర్. 2014లో వచ్చిన ఈ సినిమాకు 8.7 ఐఎండీబీ రేటింగ్ ఉంది. క్రిస్టఫర్ నోలాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఓ రైతు, నాసా మాజీ సైంటిస్టు.. మనుషులు జీవించడానికి ఇంటర్‌స్టెల్లార్ లో ఉన్న ఓ కొత్త భూమిని వెతుక్కుంటూ వెళ్తాడు. మన గెలాక్సీ బయట ఉండే తారాలోకంలోని గ్రహాల అన్వేషణలో అతనితోపాటు మిగిలిన సైంటిస్టులు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటారన్నది ఈ మూవీలో చూడొచ్చు. ప్రైమ్ వీడియోలో మూవీ ఉంది.

అప్ (యానిమేషన్ మూవీ) - హాట్‌స్టార్

అప్ ఓ యానిమేషన్ మూవీ. తన భార్య కల అయిన ప్యారడైజ్ ఫాల్స్ ను వెతుక్కుంటూ తన ఎగిరే ఇంటిలో వెళ్లే ఓ వృద్ధుడు చేసే అడ్వెంచరే ఈ అప్ మూవీ. ఈ సినిమాను హాట్‌స్టార్ లో చూడొచ్చు. ఈ సినిమాకు 8.3 ఐఎండీబీ రేటింగ్ ఉంది.

పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్: ది కర్స్ ఆఫ్ ద బ్లాక్ పెర్ల్ - హాట్‌స్టార్

అడ్వెంచర్ మూవీస్ అనగానే పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ సిరీస్ లేకుండా ఉండదు. ఈ సిరీస్ నుంచి 2003లో వచ్చిన ది కర్స్ ఆఫ్ ద బ్లాక్ పర్ల్ మూవీకి 8.1 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఈ సినిమాను హాట్‌స్టార్ లో చూడొచ్చు.

లైఫ్ ఆఫ్ పై - ప్రైమ్ వీడియో

ఓ చిన్న బోటులో ఓ హైనా, ఓ పులితోపాటు చిక్కుకుపోయిన పై పటేల్ అనే వ్యక్తి చుట్టూ తిరిగే కథే ఈ లైఫ్ ఆఫ్ పై. అతడు ఆ క్రూర మృగాలతోపాటు సముద్రం మధ్యలో చిక్కుకుపోయిన ఆ బోటు నుంచి ఎలా బయటపడ్డాడన్నది మూవీ స్టోరీ. ఈ సినిమాకు 7.9 రేటింగ్ ఉంది. ప్రైమ్ వీడియోలో మూవీ చూడొచ్చు.

IPL_Entry_Point