Actor Sivaji: హాట్ బ్యూటితో హీరో శివాజీ అసభ్య ప్రవర్తన.. ఆకు.. సున్నం అంటూ షాకింగ్‌గా!
Bigg Boss 7 Telugu Day 45 Promo: మీరు ఎప్పుడు చూడనిది.. జరగనిది.. ఆదివారం జరగబోతుంది అని నాగార్జున చెప్పినట్లుగానే బిగ్ బాస్ 7 తెలుగు 2.0 ఉండనుంది. తాజాగా విడుదల చేసిన బిగ్ బాస్ తెలుగు 7 ప్రోమో వివరాల్లోకి వెళితే..
Bigg Boss 7 Telugu October 18th Promo: బిగ్ బాస్ 7 తెలుగు ఏడో వారం నామినేషన్లు చాలా హోరాహోరీగా సాగాయి. ఫలితంగా ఏడుగురు నామినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో ప్రతివారం కెప్టెన్సీ టాస్క్ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. అందుకోసం వివిధ రకాల టాస్కులు పెట్టి కంటెండర్స్ ను సెలెక్ట్ చేస్తారు. అలా తాజాగా బిగ్ బాస్ 7 తెలుగు అక్టోబర్ 18వ తేది ఎపిసోడ్లో హౌజ్‌మేట్స్ కు గులాబీ పురం, జిలేబీ పురం అనే టాస్క్ ఇచ్చాడు పెద్దయ్య.
గులాబీ పురం-జిలేబీ పురం
ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ కు సంబంధించిన విషయాలను బిగ్ బాస్ 7 తెలుగు డే 45 ప్రోమోలో చూపించారు. ఇందులో గులాబీ పురం ఊరు, జిలేబీ పురం ఊరిలోకి వచ్చిన గ్రహాంతరవాసులను ఎవరు ఎక్కువ సంతోషపెడితే వారికి కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లభిస్తుందని బిగ్ బాస్ నుంచి వచ్చిన ప్రకటనను అర్జున్ తెలిపాడు. టేస్టీ తేజతో విడాకులు తీసుకున్న గులాబీ పురం సర్పంచ్‌గా శోభా శెట్టి, ఊళ్లో వాళ్లందరకి గాసిప్స్ చెప్పే టీ షాప్ అమర్ దీప్ అని అర్జున్ చెప్పాడు.
లంగా ఓణిలో ముద్దుగుమ్మలు
అర్జున్ చెప్పాగానే అంతా నవ్వుకున్నారు. తర్వాత శోభా శెట్టి తన పాత్రలో సర్పంచ్‌గా, అమర్ టీ షాపు వాడిగా చెలరేగిపోయారు. ఇక పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు వచ్చిన ఎన్నారై అబ్బాయిగా యావర్ చేశాడు. వీళ్లందరికి సంచాలక్‌గా హీరో శివాజీ చేశాడు. అనంతరం తేజ, శోభా శెట్టి టాస్కులో భాగంగా గొడవపడ్డారు. ప్రియాంక లంగా ఓణీలో పల్లెటూరి అమ్మాయిగా చేసింది. అనంతరం హాట్ బ్యూటి అశ్వినీ శ్రీ కూడా లంగా ఓణిలో కనువిందు చేసింది.
అందగత్తెను మరి
ఏంటే జిలేబీ చూడకుండా వెళ్లిపోతున్నావ్ అని అర్జున్ అంటే.. నువ్వేమైనా చేసుకుంటావేంట్రా అని అశ్వినీ అంది. నువ్ ఊ అనాలేగానీ జిలేబీ పురానికి జిలేబీ ఫేమస్ అయ్యేలా చేసేయను అని అర్జున్ అన్నాడు. అనంతరం ఊరును ఓ ఊపు ఊపేత్తున్నావట అని శివాజీ అంటే.. ఇంత అందగత్తెను మరి.. ఊపేయనేంటీ అని అశ్విని బదులు ఇచ్చింది. నీ అందం సూద్దాం.. తోటకు రా మరి అని సరదాగా అన్నాడు శివాజీ.
ఆకు ఆకే కదరా..
అదంతా విన్న సందీప్.. ఓ పెద్దాయన.. చాలా లేతాకు.. అని అన్నాడు. ఆకు ఏదైనా ఆకే కదరా.. మనం సున్నం రాత్తాం అంతే అంటూ శివాజీ వెళ్లిపోయాడు. అయితే, ఇదంతా టాస్కులో భాగంగా జరిగినా.. శివాజీ మాట్లాడిన మాటలు అసభ్యంగా, షాకింగ్‌గా ఉన్నాయని కొంతమంది అంటుంటే.. అమర్, అర్జున్, శివాజీ, ప్రశాంత్ యాక్టింగ్ బాగుందని మెచ్చుకుంటున్నారు.