Action Thriller Movie OTT: రైల్లో జరిగిన నరమేధం.. హాలీవుడ్‌లోకీ రీమేక్.. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే..-action thriller movie kill to stream on disney plus hotstar ott after its theatrical run ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Action Thriller Movie Ott: రైల్లో జరిగిన నరమేధం.. హాలీవుడ్‌లోకీ రీమేక్.. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే..

Action Thriller Movie OTT: రైల్లో జరిగిన నరమేధం.. హాలీవుడ్‌లోకీ రీమేక్.. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే..

Hari Prasad S HT Telugu

Action Thriller Movie: ఓ రైల్లో జరిగిన నరమేధం.. హాలీవుడ్ లోకీ రీమేక్ అవుతున్న మన ఇండియన్ సినిమా.. త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ ఓటీటీ పార్ట్‌నర్ కన్ఫమ్ అయింది.

రైల్లో జరిగిన నరమేధం.. హాలీవుడ్‌లోకీ రీమేక్.. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేది ఈ ఓటీటీలోకే..

Action Thriller Movie: ఇప్పటి వరకూ ఇండియా ఎప్పుడూ చూడని మోస్ట్ వయోలెంట్ మూవీగా గతేడాది వచ్చిన యానిమల్ ను చెబుతారు. కానీ అంతకుమించిన సినిమా తమదే అంటూ ఇప్పుడీ కొత్త యాక్షన్ థ్రిల్లర్ మూవీ వస్తోంది. ఈ సినిమా పేరు కిల్. హాలీవుడ్ లోనూ రీమేక్ కాబోతున్న ఈ సినిమా శుక్రవారం (జులై 5) రిలీజ్ కానుండగా.. ఓటీటీ పార్ట్‌నర్ ఖరారైంది.

కిల్ మూవీ ఓటీటీ

ఇండియా ఇప్పటి వరకూ చూడని అత్యంత హింసాత్మక మూవీగా చెబుతూ థియేటర్లలోకి వస్తున్న సినిమా కిల్. ఈ మూవీ వచ్చే శుక్రవారం (జులై 5) థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ కు ముందే హాలీవుడ్ లో జాన్ విక్ లాంటి సినిమా తీసిన మేకర్స్.. తాము ఇంగ్లిష్ లోనూ దీనిని రీమేక్ చేయబోతున్నట్లు చెప్పారు. ఇప్పుడీ సినిమా రిలీజ్ కు ముందే తన ఓటీటీ పార్ట్‌నర్ ను ఖరారు చేసుకుంది.

ఈ మూవీ థియేటర్లలో నుంచి వెళ్లిపోయిన తర్వాత డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లోకి రానుంది. కరణ్ జోహార్ తోపాటు గునీత్ మోంగా, అపూర్వ మెహతాలాంటి వాళ్లు నిర్మించిన ఈ సినిమాను నిఖిల్ నగేష్ భట్ డైరెక్ట్ చేశాడు. ఈ మధ్యే వచ్చిన ట్రైలర్ చూస్తేనే ఈ సినిమాలో ఎంత హింస ఉండబోతోందో అర్థమవుతోంది. ఓ రైల్లో ఏకంగా నరమేధమే జరిగింది.

కిల్ ట్రైలర్

కిల్ మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజైంది. ఈ సినిమాలో లక్ష్య, రాఘవ్ జుయెల్, ఆశిష్ విద్యార్థి, హర్ష్ చాయా, తాన్యా మణిక్‌తలా, అభిషేక్ చౌహాన్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ట్రైలర్ లోనే ఇది ఇండియాలో ఇప్పటి వరకూ చూడని అత్యంత హింసాత్మక సినిమాగా మేకర్స్ చెప్పడం విశేషం. ఇది అమృత్, తులికా అనే జంట చుట్టూ తిరిగే స్టోరీ.

ఈ జంట రైల్లో ప్రయాణిస్తుండగా.. ఓ దొంగల ముఠా కత్తులు, తుపాకులతో రైల్లోకి వచ్చి భీభత్సం సృష్టిస్తుంది. ఈ క్రమంలో ఈ జంట కూడా విడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ హీరో చాలా క్రూరంగా మారతాడు. ఆ దొంగల ముఠాలోని సభ్యులను అత్యంత క్రూరంగా చంపేస్తాడు. ట్రైలరే చాలా వయోలెంట్ గా సాగింది. ఈ సినిమా ప్రీవ్యూలు కూడా ఇప్పటికే రాగా.. పలువురు రివ్యూలు కూడా ఇచ్చేశారు.

ఈ మూవీ హిందీలో సోలో రిలీజ్ గా రాబోతోంది. థియేటర్ల సంగతేమోగానీ.. ఓటీటీల్లో మాత్రం ఇలాంటి వయోలెంట్ సినిమాలకు మంచి రెస్పాన్సే వస్తోంది. మరి హాట్‌స్టార్ లో రిలీజైన తర్వాత ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.