థియేటర్లలోకి రాకుండా నేరుగా ఓటీటీల్లోకి వచ్చే హిందీ సినిమాల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. జునైద్ ఖాన్ హీరోగా నటించిన మహారాజ్ చిత్రం జూన్‍లో డైరెక్ట్‌గా ఓటీటీలోకే వచ్చింది. ఈనెల (జూలై) రెండు హిందీ సినిమాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టేయనున్నాయి. కకుడా, వైల్డ్ వైల్డ్ పంజాబ్ చిత్రాలు డైరెక్ట్‌గా ఓటీటీల్లోకి రానున్నాయి. ఒకే వారంలో అడుగుపెట్టనున్నాయి. ఈ రెండు సినిమాల స్ట్రీమింగ్ తేదీలు కూడా ఖరారయ్యాయి.
కకుడా చిత్రం నేరుగా జూలై 12వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి రానుంది. థియేటర్లలో విడుతల చేయాలని మేకర్ అనుకున్నా.. చివరికి ఓటీటీలోనే ఈ హారర్ కామెడీ మూవీని డైరెక్ట్‌గా తీసుకొచ్చేందుకు రెడీ అయ్యారు. కకుడా సినిమాలో రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా, షకీబ్ కలీం ప్రధాన పాత్రలు చేశారు. ఆసిఫ్ ఖాన్, సచిన్ వినోద్, అరుణ్ దూబే, సూరజ్ రాజ్ మధ్వానీ కీల్స్ చేశారు.
కకుడా చిత్రానికి ఆదిత్య సర్పోర్ట్‌దార్ దర్శకత్వం వహించారు. రాటోడీ అనే గ్రామంలో సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఇళ్లకు ఉన్న ప్రత్యేకమైన చిన్న తలుపును తెరవడం చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది. తలుపు తెరవకపోతే కకుడా వచ్చి ఇంట్లోని పురుషుడికి హానీ చేస్తుందనే అంశంపై ఉండనుంది. హారర్‌తో పాటు కామెడీ కూడా ఈ మూవీలో ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది. కకుడా చిత్రాన్ని ఆర్ఎస్‍వీపీ బ్యానర్‌పై రోనీ స్క్రూవాలా ప్రొడ్యూజ్ చేశారు. జూలై 12వ తేదీ తేదీ నుంచి కకుడా చిత్రాన్ని జీ5లో చూడొచ్చు.
వైల్డ్ వైల్డ్ పంజాబ్ చిత్రం జూలై 10వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చేయనుంది. బ్రేకప్ అయిన స్నేహితుడిలో మళ్లీ జోష్ నింపేందుకు ఫ్రెండ్స్ ట్రిప్‍కు వెళ్లడం చుట్టూ ఈ చిత్రం ఉంటుంది. వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మనోజ్ సింగ్, జెస్సీ గిల్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. పత్రలేఖ, ఇషితా రాజ్ కూడా మెయిన్ రోల్స్ చేశారు.
స్నేహితుల మధ్య బంధంతో ఈ కామెడీ అడ్వెంచర్ డ్రామాను దర్శకుడు సిమ్రన్‍ప్రీత్ సింగ్ రూపొందించారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ కామెడీతో ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ పతాకంపై లవ్ రంజన్, అంకుర్ గార్గ్ నిర్మించగా.. టీ సిరీస్ బ్యానర్‌పై గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పిస్తున్నారు. బ్రేకప్ అవడంతో ఖన్నే (వరుణ్) బాధలో ఉంటాడు. అయితే, అతడు ఆ విషయాన్ని మరిచిపోయి మళ్లీ ఆనందంగా ఉండేలా చేయాలని స్నేహితలు ట్రిప్‍కు వెళ్లాలని డిసైడ్ అవుతారు. పఠాన్‍కోట్‍కు కారులో బయలుదేరతారు. ఆ జర్నీలో వారికి ఎదురైన పరిస్థితుల చుట్టూ వైల్డ్ వైల్డ్ పంజాబ్ చిత్రం రూపొందింది. ఆ సినిమాను జూలై 10వ తేదీ నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయవచ్చు.
ఇలా ఒకే వారంలో రెండు హిందీ సినిమాలు ఓటీటీల్లోకి వస్తున్నాయి. జూలై 10 నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వైల్డ్ వైల్డ్ పంజాబ్, జూలై 12 జీ5 ఓటీటీలో కకుడా చిత్రాలు స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానున్నాయి.
టాపిక్