OTT Movie: ఓటీటీలోకి నేరుగా అభిషేక్ బచ్చన్ చిత్రం.. అప్‍డేట్ ఇచ్చిన ప్లాట్‍ఫామ్.. స్టోరీలైన్ ఇదే!-abhishek bachchan dance drama movie be happy to stream on amazon prime video ott soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: ఓటీటీలోకి నేరుగా అభిషేక్ బచ్చన్ చిత్రం.. అప్‍డేట్ ఇచ్చిన ప్లాట్‍ఫామ్.. స్టోరీలైన్ ఇదే!

OTT Movie: ఓటీటీలోకి నేరుగా అభిషేక్ బచ్చన్ చిత్రం.. అప్‍డేట్ ఇచ్చిన ప్లాట్‍ఫామ్.. స్టోరీలైన్ ఇదే!

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 21, 2024 03:39 PM IST

Be Happy OTT: బీ హ్యాపీ సినిమా నేరుగా ఓటీటీలోకి వచ్చేయనుంది. అభిషేక్ బచ్చన్ ఈ మూవీలో లీడ్ రోల్ చేశారు. ఈ సినిమాపై తాజాగా అప్‍డేట్ ఇచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్. ఓ కొత్త పోస్టర్ కూడా తీసుకొచ్చింది.

OTT Movie: ఓటీటీలోకి నేరుగా అభిషేక్ బచ్చన్ చిత్రం.. అప్‍డేట్ ఇచ్చిన ప్లాట్‍ఫామ్
OTT Movie: ఓటీటీలోకి నేరుగా అభిషేక్ బచ్చన్ చిత్రం.. అప్‍డేట్ ఇచ్చిన ప్లాట్‍ఫామ్

బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేస్తున్నారు. కంటెంట్ ప్రాధాన్యమున్న చిత్రాలే కొన్నేళ్లుగా ఎక్కువగా చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్‍లో ‘బీ హ్యాపీ’ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోకే స్ట్రీమింగ్‍కు రానుంది. తండ్రీకూతుళ్ల మధ్య ఎమోషనల్ డ్యాన్స్ డ్రామా మూవీగా ఇది ఉండనుంది. బీ హ్యాపీ చిత్రంపై తాజాగా అప్‍డేట్ వచ్చింది.

అప్‍డేట్ ఇదే

అభిషేక్ బచ్చన్ హీరోగా బీ హ్యాపీ చిత్రాన్ని ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ గతంలో ప్రకటించింది. అయితే, తాజాగా ఈ చిత్రంపై అప్‍డేట్ ఇచ్చింది. త్వరలోనే స్ట్రీమింగ్‍కు వస్తుందంటూ నేడు (సెప్టెంబర్ 21) వెల్లడించింది. దీంతో అక్టోబర్‌లో ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

బీ హ్యాపీ త్వరలో వస్తోందంటూ నేడు ఓ కొత్త పోస్టర్‌ను కూడా అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో మీడియాలో పోస్ట్ చేసింది. అభిషేక్ బచ్చన్, ఆయన కూతురు పాత్రలో నటించిన ఇనాయత్ వర్మతో ఓ పోస్టర్‌ను రివీల్ చేసింది. గతంలో లూడో చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.

బీ హ్యాపీ చిత్రానికి రెమో డిసౌజా దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్, ఇనాయత్‍తో పాటు నోరా ఫతేహీ, నాజర్, జానీ లీవర్, సంచిత్ చనాన, హర్లీన్ సేథీ కీలకపాత్రలు పోషించారు. రెమో డిసౌజా ఎంటర్‌టైన్‍మెంట్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేస్తోంది.

స్టోరీలైన్ ఇదే

దేశంలోనే అతిపెద్ద డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొనాలని కూతురు (ఇనాయత్ వర్మ) కలలు కంటుంది. దీన్ని సాకారం చేసేందుకు తండ్రి (అభిషేక్ బచ్చన్) ఆమెకు దిశానిర్దేశం చేస్తుంటారు. తన కూతురిని సంతోషంగా ఉంచేందుకు కష్టపడుతుంటారు. కూతురిని ఆ రియాల్టీ షోకు పంపేందుకు ఆ తండ్రి ఏం చేశాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారనే విషయం చుట్టూ బీ హ్యాపీ స్టోరీ సాగుతుంది.

బీ హ్యాపీ మూవీకి రెమో డిసౌజాతో పాటు తుషార్ హిరానందిని, కనిష్క సింగ్, చిరాగ్ గార్గ్ కూడా రైటర్లుగా పని చేశారు. డైరెక్టర్ రెమో డిసౌజా తెరకెక్కిస్తున్నారు. ఎమోషనల్‍గా హృదయాన్ని హత్తుకునేలా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. డ్యాన్స్ ప్రధానంగా ఈ మూవీ సాగనుంది.

అభిషేక్ లైనప్

డైరెక్టర్ షూజిత్ సిర్కార్ దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్ ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలోనూ తండ్రి పాత్ర . విక్కీ డోనర్ పోషిస్తున్నారు. పీకూ, సర్దార్ ఉద్దమ్ సింగ్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన సిర్కార్‌తో అభిషేక్ మూవీ చేస్తుండటంతో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీని రోనీ లహిరి, శీల్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. కింగ్ అనే మరో సినిమా కూడా అభిషేక్ లైనప్‍లో ఉంది.