National Award Movie: మూడు నేష‌న‌ల్ అవార్డ్స్ గెలుచుకున్న బాలీవుడ్ మూవీ తెలుగులోకి వ‌స్తోంది - టైటిల్ ఇదే!-3 national awards winning bollywood movie fouza release in telugu soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  National Award Movie: మూడు నేష‌న‌ల్ అవార్డ్స్ గెలుచుకున్న బాలీవుడ్ మూవీ తెలుగులోకి వ‌స్తోంది - టైటిల్ ఇదే!

National Award Movie: మూడు నేష‌న‌ల్ అవార్డ్స్ గెలుచుకున్న బాలీవుడ్ మూవీ తెలుగులోకి వ‌స్తోంది - టైటిల్ ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
Oct 28, 2024 02:18 PM IST

National Award Movie మూడు నేష‌న‌ల్ అవార్డ్స్ పొందిన బాలీవుడ్ మూవీ ఫౌజా తెలుగులో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో కార్తిక్ ద‌మ్ము, ఐశ్వ‌ర్యాసింగ్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాలో ప‌వ‌న్ మ‌ల్హోత్రా కీల‌క పాత్ర పోషించాడు. ఫౌజా తెలుగు వెర్ష‌న్‌ను తెలుగులో స్క్రీనింగ్ చేశారు.

నేషనల్ అవార్డ్ మూవీ
నేషనల్ అవార్డ్ మూవీ

National Award Movie గ‌త ఏడాది బాలీవుడ్‌లో రిలీజైన ఫౌజా మూవీ మూడు నేష‌న‌ల్ అవార్డుల‌ను గెలుచుకుంది. బెస్ట్ స‌పోర్టింగ్ యాక్ట‌ర్‌, బెస్ట్ లిర‌క్స్‌తో పాటు బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్ట‌ర్ విభాగాల్లో జాతీయ అవార్డుల‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ యాక్ష‌న్ డ్రామా మూవీ అదే పేరుతో తెలుగు, త‌మిళ భాష‌ల్లోకి డ‌బ్ అవుతోంది.

ఫౌజా మూవీలో కార్తిక్ ద‌మ్ము, ఐశ్వ‌ర్య‌సింగ్ హీరోయిన్లుగా న‌టించారు. ప‌వ‌న్ మ‌ల్హోత్రా కీల‌క పాత్ర పోషించాడు. ఫౌజా మూవీ తెలుగు వెర్ష‌న్‌ను ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో స్పెష‌ల్‌గా స్క్రీనింగ్‌చేశారు.

దేశ‌భ‌క్తికి తండ్రీకొడుకుల అనుబంధాన్ని జోడించి ద‌ర్శ‌కుడు ప్ర‌మోద్ కుమార్ ఈ మూవీని తెర‌కెక్కించారు.

ఆర్మీ బ్యాక్‌డ్రాప్‌లో...

ప‌వ‌న్ మ‌ల్హోత్రా ఫ్యామిలీలోని మ‌గాళ్లంద‌రూ ఆర్మీలో జాబ్ చేస్తూ దేశానికి సేవ‌చేస్తుంటారు. త‌న కొడుకు కార్తిక్‌ను కూడా ఆర్మీ ఆఫీస‌ర్‌గా చూడాల‌ని క‌ల‌లు కంటాడు. కార్తిక్‌కు ఆర్మీ జాబ్ చేయ‌డం మాత్రం ఇష్టం ఉండ‌దు. తండ్రి బ‌ల‌వంతం మేర‌కు ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతాడు. ఈ క్ర‌మంలో తండ్రి కొడుకుల మ‌ధ్య ఎలాంటి గొడ‌వ‌లు జ‌రిగాయి? తండ్రి కోరిక‌ను కొడుకు ఎలా నెర‌వేర్చాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

భాషా స‌రిహ‌ద్దులు ఉండ‌వు...

హీరో కార్తీక్ దమ్ము మాట్లాడుతూ.. ‘నేను హైద్రాబాద్‌లో పుట్టాను. మళ్లీ ఇలా ఫౌజా మూవీ కోసం ఇక్కడకు రావడం ఆనందంగా ఉంది. సినిమాకి భాషా సరిహద్దులు ఉండవు. మ‌రీ ముఖ్యంగా ఇలాంటి చిత్రానికి భాషతో సంబంధం ఉండదు. త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లోకి ఈ చిత్రం రాబోతోంది అని తెలిపాడు.

డ‌బ్బులు ఎన్ని ఉన్నా...

‘డబ్బులు ఎన్ని ఉన్నా కూడా బ్రాండెండ్ బట్టల్ని కొనగలం.. కానీ ఇండియన్ ఆర్మీ యూనిఫాంని మాత్రం కొనలేం.. దాన్ని కష్టంతో, ఇష్టంతో సాధించుకోవాలి.. దేశ భక్తి ఉంటేనే అది మన సొంతం అవుతుంది. దేశం అంటే ప్రేమ, భక్తి ఉన్న ప్రతీ ఒక్కరికి ఫౌజా నచ్చుతుంది. తొంద‌ర‌లోనే ఫౌజా తెలుగు వెర్ష‌న్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేస్తామ‌ని ’ ప్ర‌మోద్ కుమార్ అన్నారు.

క‌న్నీళ్లు...

కాంతి డి. సురేష్ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని చూసినప్పుడు అందరూ ఏడ్చారు. అసలు సినిమాకు భాష అనేది అడ్డంకి కాదు. మూవీకి భాష, జాతి, దేశం, ప్రాంతం అనేది ఉండదు. సినిమాలు, ఆటలకు ఎమోషన్స్ ముఖ్యం. వీటికి భాష అనేది సమస్య కాదు’ అని పేర్కొన్నారు.

Whats_app_banner