RevanthReddy: ప్రగతి భవన్‌ను అంబేద్కర్‌ ప్రజాభవన్‌గా మారుస్తామన్న రేవంత్ రెడ్డి-revanth reddy announced that the name of pragati bhavan will be changed to ambedkar praja bhavan ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Revanthreddy: ప్రగతి భవన్‌ను అంబేద్కర్‌ ప్రజాభవన్‌గా మారుస్తామన్న రేవంత్ రెడ్డి

RevanthReddy: ప్రగతి భవన్‌ను అంబేద్కర్‌ ప్రజాభవన్‌గా మారుస్తామన్న రేవంత్ రెడ్డి

Sarath chandra.B HT Telugu
Nov 23, 2023 09:21 AM IST

RevanthReddy: కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌ను అంబేద్కర్‌ ప్రజా భవన్‌గా మారుస్తామని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం ప్రకటించారు.

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి (PTI)

RevanthReddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రగతి భవన్ పేరును 'అంబేద్కర్ ప్రజా భవన్'గా మారుస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బుధవారం ప్రకటించారు.

"ప్రగతి భవన్‌కు అంబేద్కర్ ప్రజా భవన్‌గా పేరు పెడతామని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ గేట్లు తొలగిస్తారని చెప్పారు. దానికి బాబా సాహెబ్ అంబేద్కర్ 'ప్రజా భవన్' అని పేరు పెడతామని ప్రకటించారు.

తెలంగాణ ప్రజల కోసం 24గంటలు తెరిచి ఉంటుందన్నారు. ఏ నియోజకవర్గం నుండి వచ్చిన ప్రజలనైనా అనుమతిస్తారని. తమ ఫిర్యాదులను సమర్పించి పరిష్కారాలను పొందేందుకు ఎప్పుడైనా ప్రజా భవన్‌లోకి ప్రవేశించవచ్చని రేవంత్ రెడ్డి అన్నారు.

బేగంపేటలోని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పునర్నిర్మాణం చేవారు. దానికి ప్రగతి భవన్‌గా పిలుస్తున్నారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్నే క్యాంపు కార్యాలయంగా మార్చుకుని విధులు నిర్వహిస్తున్నారు.

ఈ దఫా ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొమ్మిదిన్నరేళ్లుగా బిఆర్‌ఎస్‌ అధికారంలో ఉంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బిఆర్‌ఎస్‌ను ఓడించాలని కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

తెలంగాణలో నవంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మరో నాలుగు రాష్ట్రాలతో పాటు ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరగనుంది. 2018లో జరిగిన మునుపటి అసెంబ్లీ ఎన్నికల్లో, గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం 119 సీట్లలో 88 సీట్లను గెలుచుకుంది, మొత్తం ఓట్ల షేర్‌లో 47.4 శాతం సాధించింది. కాంగ్రెస్ కేవలం 19 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సారి ఎన్ినకల్లో బలం పుంజుకుంని కేసీఆర్‌ను ఓడించాలని ఆ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది.

Whats_app_banner