PM Modi : ప్రజల సొమ్ముతో కేసీఆర్ ఫాoహౌస్ నిర్మాణం, పేదల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు పదేళ్లు- ప్రధాని మోదీ
PM Modi : తెలంగాణ ప్రజలను కలవని ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు అవసరమా? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ ఫాo హౌస్ నిర్మించుకుని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడానికి పదేళ్లు కాలయాపన చేశారని విమర్శించారు.
PM Modi : ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ తన ప్రచారంలో స్థానిక ప్రజలను ఉద్దేశించి తెలుగులో మాట్లాడి ఆశ్చర్యానికి గురి చేశారు. ' తెలంగాణ ప్రజలను కలవని ముఖ్యమంత్రి మనకు అవసరమా '... ఒకరోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రి అంటూ ప్రధాని మోదీ తెలుగులో మాట్లాడారు. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని, అధినేత ఏo చెప్తే అది కేసీఆర్ పాటిస్తారన్నారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ ఫాo హౌస్ నిర్మించుకున్నారని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడానికి పదేళ్లు కాలయాపన చేశారని అన్నారు. ఉత్తర తెలంగాణలో రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు.
కొయ్య బొమ్మలకు ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తాం
కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్థానికంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నిర్మల్. కోయ్య బొమ్మలు పరిశ్రమ నీరుగారిపోయిందని, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేక్ ఇన్ ఇండియా ద్వారా కొయ్యబొమ్మల పారిశ్రామిక కేంద్రాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాల కృషి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు ఒకటేనని, ప్రజలను మోసం చేసే పనులు చేపట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందజేయలేదని మండిపడ్డారు. దళితుడని సీఎం చేస్తానని కేసీఆర్ కేసీఆర్ మోసం చేశారని, ప్రాజెక్టుకుల పేరుతో కేసీఆర్ అవినీతి పాల్పడ్డాడని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, ప్రభుత్వం రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని, పేదలకు గ్యారెంటీగా ఇండ్లు అందజేస్తామని, కేసీఆర్ అవినీతిని బయటకు తీస్తామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు విసిగిపోయారని బీఆర్ఎస్ కాంగ్రెస్ కు వ్యతిరేక ఓట్లు వేయడం ఖాయమని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మతం పేరుతో ఐటీ పార్కు ఏర్పాటు చేస్తాననడం సిగ్గుచేటు అన్నారు. వారసత్వ రాజకీయాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొందని, ఎస్సీ ఓబీసీలకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తేవడంలో విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో గత ఐదేళ్లలో ఐదు శాతం గిరిజన రిజర్వేషన్లు పెంచామని, గిరిజనులకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఆదివాసుల సంక్షేమం కోసం ఇటీవల సరికొత్త పథకం ప్రారంభించమన్నారు.
తెలంగాణలో మాదిగలకు అన్యాయం
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు మాదిగ సామాజిక వర్గాలను నిర్లక్ష్యానికి గురిచేసిందని, బీజేపీ ప్రభుత్వం వారి సమస్యలను గుర్తించిందని ప్రత్యేక కమిటీ వేసి ఎస్సీ వర్గీకరణకు చర్యలు చేపట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా అనేక భూములను రాష్ట్ర ప్రభుత్వం కబ్జా చేసిందన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ధరణిని రద్దుచేసి మీ భూమి అనే యాప్ ద్వారా రైతుల భూములకు రక్షణ కల్పిస్తామన్నారు. దేశంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, తెలంగాణను డబ్బులు ఇంజన్ సర్కార్ ద్వారా మరింత అభివృద్ధి చేసి స్థానిక ప్రజలను ఆదుకుంటామని తెలిపారు.
రిపోర్టింగ్ : రామోజీ వేణుగోపాల్, ఉమ్మడి ఆదిలాబాద్